Daaku Maharaaj Day 20 collections: ఇది ఊహించలేదు.. ‘డాకు మహారాజ్’ 20వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 20 collections: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj ). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హై వోల్టేజీ యాక్షన్ మూవీకి అదిరిపోయే పాజివిట్ రెస్పాన్స్ అందుకుని.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. దీంతో ఈ మూవీ హిందీ వర్షన్ లో కూడా విడుదలైంది. మొత్తానికి బాలకృష్ణ యాక్టింగ్,యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి. వీకెండ్స్ లో దుమ్మురేపుతున్న.. వర్కింగ్ డేస్ లో మాత్రం కాస్త వీక్ అవుతోంది . ఈ నేపథ్యంలో బాలయ్య 'డాకు మహారాజ్' ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? 20వ రోజు డాకు మహారాజ్ కలెక్షన్స్ వివరాలు..
సంక్రాంతి బరిలోకి దిగిన 'డాకు మహారాజ్'లో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించగా.. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా.. ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ లో మాస్ అండ్ గ్లామర్ స్టెప్పులేసింది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. హాట్రిక్ హిట్స్ తో పుల్ జోష్ లో ఉన్న బాలయ్య, సక్సెస్ పుల్ డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కడంతో 'డాకు మహారాజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుమారుగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాకు 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ అయింది. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే హైయ్యేస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది 'డాకు మహారాజ్'.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. అంచనాలకు తగ్గట్టుగానే కాకుండా అంతకు మించి అనేలా కలెక్షన్స్ అందుకుంది. తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. తొలివారంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 66. 4 కోట్లు కలెక్ట్ చేయగా.. రెండో వారంలో 17.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో వారం రూ. 5.7 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. అన్ని సెంటర్ ల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల బాటలో పరిగెడుతోంది.
ఇక 'డాకు మహారాజ్' 20వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 20 collections) వివరాలకు వస్తే.. వీకెండ్ లో కలెక్షన్లు పుంజుకుంటున్నా.. వర్కింగ్ డేస్ లో మాత్రం చతికిలపడుతోంది. అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ అందుకోలేకపోతుంది. అలాగే.. నార్డ్ లో జైత్ర యాత్ర సాగిస్తుందని భావించినా.. అంతగా ప్రభావం చూపించలేదు. ఇక శుక్రవారం (డే 19) రూ.42 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.90.2 కోట్లు రాబట్టింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా తొలి వారంలో రూ.100కోట్ల మార్క్ దాటగా.. ఇప్పటి వరకు ఈ సినిమా వర్డల్ వైడ్ గా రూ.165 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ లో కలెక్షన్స్ పుంజుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











