Daaku Maharaaj collections: వీకెండ్ లో డాకు మహారాజ్ కు ఎదురుదెబ్బ.. 22వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 22 collections: హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి నటసింహం బాలకృష్ణ కు మరో విజయం తోడైంది. 'అఖండ' సినిమా నుంచి బాలయ్య గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ఎవ్వరూ ఊహించిన విధంగా సక్సెస్ అందుకుంటు దూసుకపోతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన 'డాకు మహారాజ్' లో బాలకృష్ణ యాక్టింగ్,యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి. మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో బాక్సాఫీస్ ను షేకాడిస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే బ్రేక్-ఈవెన్ గ్రాస్ చేసిన ఈ సినిమా వీకెండ్స్ లో దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య 'డాకు మహారాజ్' ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? 22వ రోజు డాకు మహారాజ్ కలెక్షన్స్ వివరాలు..
డైరెక్టర్ బాబీ కొల్లి రూపొందిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించగా.. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్ లో మెప్పించారు. ఊర్వశి రౌటెలా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటించడమే కాకుండా ఐటమ్ సాంగ్‌లో మాస్ అండ్ గ్లామర్ స్టెప్పులేసి..మాస్ ఆడియన్స్ ను దబిడి దిబిడి చేసింది.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. హాట్రిక్ హిట్స్ తో పుల్ జోష్ లో ఉన్న బాలయ్య, సక్సెస్ పుల్ డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కడంతో 'డాకు మహారాజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాకు 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లుగా నిర్ణయించాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమాను గ్రాండ్ గా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. బాలయ్య తన సినీ కెరీర్ లోనే హైయ్యేస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' నిలిచింది.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. అంచనాలకు తగ్గట్టుగానే కాకుండా అంతకు మించి అనేలా కలెక్షన్స్ వసూలు చేసింది. తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. తొలివారంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 66. 4 కోట్లు కలెక్ట్ చేయగా.. రెండో వారంలో 17.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో వారం రూ. 5.7 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. ప్రాంతాల వారిగా చూస్తే.. ఏపీ,తెలంగాణలో రూ 68.57 కోట్లు అందుకోగా, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో రూ. 4.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 8.20 కోట్లు అందుకుంది. ఇలా అన్ని సెంటర్ ల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల బాటలో నడుస్తోంది డాకు మహారాజ్.

ఇక 'డాకు మహారాజ్' 22వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 22 collections) వివరాలకు వస్తే.. వీకెండ్ లో డాకు మహారాజ్ కలెక్షన్లు కాస్త పుంజుకుంటున్నాయి. కానీ, ఎక్స్ పెర్ట్ చేసిన రేంజ్ లో వసూలు రాబట్టలేకపోయింది. శనివారం(డే 21)రూ.32 లక్షలు వసూలు చేయగా.. ఆదివారం నాడు 46 లక్షలు వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.91 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా వర్డల్ వైడ్ గా రూ.167.5 కోట్ల గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది. వీకెండ్ లో కోట్లల్లో కలెక్షన్స్ వస్తాయని ఊహించిన లక్షలతో సరిపెట్టుకోవాల్సింది. ఇక వర్కింగ్ డేస్ లో డాకుమహారాజ్ కు ఎదురుదెబ్బ తగులుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











