Daaku Maharaaj Day3 collections: బాక్సాఫీస్‌ వద్ద డాకు మహారాజ్ మాస్ తాండవం.. మూడో రోజు ఎన్ని కోట్లంటే?

Daaku Maharaaj Day 3 collections: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై వోల్టేజీ మూవీగా తెరెకెక్కిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇక బాలయ్య బాబు యాక్షన్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్ కాంబో సక్సెస్ కావడంతో కలెక్షన్ల పరంగా కూడా డాకు మహారాజ్ దుమ్మురేపుతోంది. అదిరిపోయేలా పాజిటివ్ రివ్యూలు, మౌత్‌ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఈ తరుణంలో డాకు మహారాజ్ మూడు రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన మూవీ డాకు మహా రాజ్. ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు కీలక పాత్రలో నటించింది. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అందించారు.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 3 Box Office Collection

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.67.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక ఓవర్సీస్ లో రూ. 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 5.40 కోట్లు. ఇలా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 80.70 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ అయింది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'డాకు మహారాజ్' ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మౌత్‌ టాక్‌తో బాలకృష్ణ సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్న 'డాకు మహరాజ్'‌ ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్లు కొల్లాకొట్టాగా.. ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 13.50 కోట్ల వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 3 Box Office Collection

ఇక మూడవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' అదే జోరు కొనసాగిస్తోంది. సక్ నిల్క్ లెక్కల ప్రకారం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.12.50 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 50.17 కోట్లు వసుళ్లు చేయగా, వర్డల్ వైడ్ గా రూ. 86 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ గణాంకాలు పరిశీలిస్తే.. బ్రేక్ ఇవెన్ కు క్రాస్ అయినట్టు తెలుస్తోంది. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి బాలయ్య తన దబిడి దిబిడి పార్మెన్స్ తో రికార్డు క్రియేట్ చేశారనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X