Daaku Maharaaj Day 4 collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న డాకు మహారాజ్.. నాలుగో రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 4 collections: బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ (Daaku Maharaaj ). సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హై యాక్షన్ వోల్టేజీ మూవీ మహారాజ్ బాక్సాఫీస్ రచ్చ చేస్తోంది. సంక్రాంతి పండుగను మరింత ఎనర్జీటిక్ గా మార్చేసింది బాలయ్య డాగు మహారాజ్. ఇక బాలయ్య యాక్షన్, బాబీ విజన్, తమన్ బీజీఎం అన్ని పర్పెక్ట్ గా సెట్ కావడంతో డాకు మహారాజ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ నాలుగవ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్ ( Daaku Maharaaj). సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అందించారు.

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.67.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ లో రూ. 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 5.40 కోట్లు.. ఇలా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 80.70 కోట్లకు చేరుకుంది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ మూవీ ట్రేడర్స్. ఇంత మొత్తంలో ప్రీ రిలీజ్ జరగడం బాలయ్య సినీ కెరీర్ లో ఇదే అత్యధికం. ఇలా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్'నయా రికార్డు క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ (Daaku Maharaaj )కు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ అందుకుంది. సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్న 'డాకు మహరాజ్' ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్లు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన బాలయ్య మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్షన్స్ అందుకోవడం విశేషం. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు కలెక్షన్స్ రూ.12.50 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు.

ఇక నాలుగో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. నాలుగో రోజు 'డాకు మహారాజ్' అదే జోరు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ నాలుగవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.9.00 కోట్లు వసూలు చేసింది. దీంతో నాలుగు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 59.40 కోట్లు వసుళ్లు చేసింది. ఇక వర్డల్ వైడ్ గా డాగు మహారాజ్ రూ.95 కోట్ల చేసినట్టు తెలుస్తోంది. ఈ జోరు కొనసాగితే.. రూ. 100 కోట్ల మార్క్ నేడు క్రాస్ అయ్యేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బాలయ్య డాకుమహారాజ్ తెలుగు రాష్ట్రాల థియేటర్ ఆక్యుపెన్సీ కూడా బాగేనే ఉంది. ఇదే జోరు ఈ వారంతం వరకు కనిపిస్తే.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసే అవకాశముంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మాస్ కలెక్షన్స్ వసూల్లు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











