Daaku Maharaaj Day 4 collections: బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న బాలయ్య.. డాకు మహారాజ్ నాలుగో రోజు ఎన్ని కో
Daaku Maharaaj Day 4 collections: నందమూరి నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj ). ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై యాక్షన్ వోల్టేజీ మూవీగా తెరకెక్కిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇక బాలయ్య మాస్ అండ్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో కలెక్షన్ల పరంగా డాకు మహారాజ్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ నాలుగవ రోజు అంచనా కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్ ( Daaku Maharaaj). సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అందించారు.

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఏపీ, తెలంగాణ కలిపి రూ.67.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక ఓవర్సీస్ లో రూ. 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 5.40 కోట్లు. ఇలా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 80.70 కోట్లకు చేరుకుంది. దీంతో బాలయ్య తన 50 ఏళ్ల సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్'నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ మూవీ ట్రేడర్స్.
బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం పర్ఫెక్ట్ గా సెట్ కావడంతో 'డాకు మహారాజ్' (Daaku Maharaaj )కు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ అందుకుంది. సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్న 'డాకు మహరాజ్' ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు కలెక్షన్స్ రూ.12.50 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు.

ఇక నాలుగో రోజు అంచనా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నాలుగో రోజు 'డాకు మహారాజ్' అదే జోరు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ నాలుగవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.4.52 కోట్లు వసూలు చేసింది. దీంతో నాలుగు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 54.92 కోట్లు వసుళ్లు చేయగా, వర్డల్ వైడ్ గా రూ.90 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ అంచనాలు మార్నింగ్ , మాట్నీ షోల వివరాలు మాత్రమే.. ఇక ఫస్ట్ షో. రెండవ షో కలెక్షన్స్ వివరాలు రాలేదు. ఈ రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జోరు ఈ వారం కనిపిస్తే.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసే అవకాశముంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోందని బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











