Daaku Maharaaj Day 5 collections: బాక్సాఫీస్‌ వద్ద ‘డాకు మహారాజ్’ కాసుల వర్షం.. ఐదో రోజు ఎన్ని కోట్లంటే?

Daaku Maharaaj Day 5 collections: నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబో మూవీ 'డాకు మహారాజ్'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ భారీ విజయం దక్కించకుంది.
బాలయ్య మాస్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోంది. హై యాక్షన్ వోల్టేజీ మూవీ డాకు మహారాజ్ పాజివిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా డాకు మహారాజ్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఐదోవ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ మాస్ యాక్షన్​ మూవీ డాకు మహారాజ్ ( Daaku Maharaaj). ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశీ రౌతెలా ఐటెం సాంగ్ లో బాలయ్యతో కలిసి మాస్ స్టెప్పులేసింది. మాస్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అందించారు.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 5 Box Office Collection Worldwide

ఇక డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. 'డాకు మహారాజ్'(Daaku Maharaaj )కు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్‌ టాక్‌ అందుకుంది. భారీ ఓపెనింగ్స్ అందుకున్న 'డాకు మహరాజ్' ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్లు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు, నాలుగవ రోజు రూ. 9.75 కోట్టు వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు.

ఇక ఐదోవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. 'డాకు మహారాజ్' డే 5 కలెక్షన్స్ జోరు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ ఐదోవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 5.75 కోట్లు వసూలు చేసింది. ఈ ఐదు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 65.90 కోట్లు వసుళ్లు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. కేవలం నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకూ డాకు మహారాజ్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.110 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 5 Box Office Collection Worldwide

ఇదెలా ఉంటే.. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయినా డాకు మహారాజ్ నేడు తమిళ వర్షన్ లో కూడా విడుదల కాబోతుంది. అలాగే మరో వారంలో హిందీలో కూడా డాకు మహారాజ్ విడుదల కాబోతుందని మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ అక్కడి ప్రేక్షకులను ఎలా ఆదరిస్తోంది వేచి చూడాలి. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ కావడంతో ప్రీక్వెల్ కూడా తెరకెక్కించే ప్లాన్​లో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ రీసెంట్​ గా ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X