Daaku Maharaaj Day 5 collections: బాలయ్య ఊరమాస్ జాతర.. డాకు మహారాజ్ ఐదో రోజు ఎన్ని కోట్లంటే?

Daaku Maharaaj Day 5 collections: నందమూరి నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj). సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బాలయ్య మాస్ యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో హై యాక్షన్ వోల్టేజీ మూవీగా మారింది డాకు మహారాజ్. ఈ మూవీకి పాజివిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా డాకు మహారాజ్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఐదోవ రోజు అంచనా కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్ ( Daaku Maharaaj). సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అందించారు.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 5 Expected Box Office Collection Worldwide

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్'నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ మూవీ ట్రేడర్స్.

ఇక డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. 'డాకు మహారాజ్'(Daaku Maharaaj )కు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్‌ టాక్‌ అందుకుంది. భారీ ఓపెనింగ్స్ అందుకున్న 'డాకు మహరాజ్' ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్లు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు, నాలుగవ రోజు రూ. 9.75 కోట్టు వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు.

ఇక ఐదోవ రోజు అంచనా కలెక్షన్స్ విషయానికి వస్తే.. 'డాకు మహారాజ్' డే 5 కలెక్షన్స్ జోరు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ ఐదోవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 3.82 కోట్లు వసూలు చేసింది. అయితే.. ఈ అంచనాలు మార్నింగ్ , మాట్నీ షోల వివరాలు మాత్రమే.. ఇక ఫస్ట్ షో. రెండవ షో కలెక్షన్స్ వివరాలు రాలేదు. ఈ రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఐదు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 63.97 కోట్లు వసుళ్లు చేసినట్టు తెలుస్తోంది.

Nandamuri Balakrishna Urvashi Rautela Daaku Maharaaj Day 5 Expected Box Office Collection Worldwide

ఇక వర్డల్ వైడ్ గా డాకు మహారాజ్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.105 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్ మెంట్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదెలా ఉంటే.. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయినా డాకు మహారాజ్ చిత్రాన్ని జనవరి 17వ తేదీన తమిళంలో విడుదల కాబోతుంది. దానికి సంబంధించిన పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. అంతేకాదు మరో వారంలో హిందీలో కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి ప్రేక్షకులను ఎలా ఆదరిస్తోంది వేచి చూడాలి మరీ..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X