Daaku Maharaaj Day 6 collections: కింగ్ ఆఫ్ సంక్రాంతి బాలయ్యే.. డాకు మహారాజ్ ఆరో రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 6 collections: నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా డాకు మహారాజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో భారీ మొత్తంలో కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ యాక్షన్ వోల్టేజీ మూవీకి పాజివిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా డాకు మహారాజ్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ ఆరోవ రోజు అంచనా కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
మాస్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్ ( Daaku Maharaaj). సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అందించారు. ఇక దీంతో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ మూవీ ట్రేడర్స్.

ఇక డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. 'డాకు మహారాజ్'(Daaku Maharaaj )కు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ అందుకుంది. దీంతో డాగు మహారాజ్ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఇలా 'డాకు మహరాజ్' ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్లు వసూళ్లు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక రెండవ రోజు రూ.13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు, నాలుగవ రోజు రూ.9.75 కోట్లు, ఐదవ రోజు రూ. 6.25 వసూలు చేసింది.
ఇక ఆరవ రోజు అంచనా కలెక్షన్స్ విషయానికి వస్తే.. 'డాకు మహారాజ్' డే 6 కలెక్షన్స్ కాస్త పడిపోయాయి. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ ఆరవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1.59 కోట్లు వసూలు చేసింది. అయితే.. ఈ అంచనాలు మార్నింగ్ , మాట్నీ షోల వివరాలు మాత్రమే.. ఇక ఫస్ట్ షో. రెండవ షో కలెక్షన్స్ వివరాలు రాలేదు. ఈ రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఆరు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 67.99 కోట్లు వసుళ్లు చేసినట్టు తెలుస్తోంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.105 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్ మెంట్ వెల్లడించింది. నేటీ కలెక్షన్లతో ఈ గణాంకాల్లో మార్పు వచ్చే అవకాశమంది. దాదాపు 110 కోట్లకు చేరుకునే అవకాశమంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











