Daaku Maharaaj Day 7 collections: బాక్సాఫీస్ వద్ద బాలయ్య బీభత్సం.. డాకు మహారాజ్ ఏడో రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 7 collections: నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబో మూవీ 'డాకు మహారాజ్'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ భారీ విజయం దక్కించకుంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఈ హై యాక్షన్ వోల్టేజీ మూవీ కలెక్షన్ల పరంగా ఎన్ని కోట్లు కొల్లాగొట్టింది? డాకు మహారాజ్ 7 వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఈ మాస్ ఎంటర్టైనర్ ను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు లీడ్ రోల్స్ లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అదుర్స్.

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనడంతో ఈ మూవీకి 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ మూవీ ట్రేడర్స్. ఇది బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' నయా రికార్డు క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. 'డాకు మహారాజ్'( Daaku Maharaaj ) పాజిటివ్ టాక్ అందుకోవడంతో తొలి భారీ ఓపెనింగ్స్ అందుకుంది. అలా 'డాకు మహరాజ్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ డే 1 రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు, నాలుగవ రోజు రూ. 9.75 కోట్లు, ఐదోవ రోజు రూ. 6.25 కోట్లు, ఆరోవ రోజు రూ. 4.2 కోట్లు అందుకుంది. మరోవైపు.. డాకు మహారాజ్ ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 124 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు. ఇక డాకు మహారాజ్ ఏడవ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 7 collections) వివరాలకు వస్తే.. 'డాకు మహారాజ్' డే 7 కలెక్షన్స్ కాస్త తగ్గాయి. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ 7 వరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 3.96 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 74.58 కోట్లు వసుళ్లు చేసినట్టు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో రోజు కలెక్షన్లు పుంజుకునే అవకాశముంది. మొత్తానికి సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య విన్నర్ గా నిలిచారు.


Click it and Unblock the Notifications











