Daaku Maharaaj Day 7 collections: దున్నెస్తున్న ‘డాకు మహారాజ్ ‘.. 7వ రోజు ఎన్ని కోట్లంటే..?
Daaku Maharaaj Day 7 collections: నట సింహం నందమూరి బాలకృష్ణ - యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్( Daaku Maharaaj ). సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది డాకు మహారాజ్. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ హై యాక్షన్ వోల్టేజీ మూవీకి పాజివిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా డాకు మహారాజ్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ 7 వ రోజు అంచనా కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ డాకు మహారాజ్ ( Daaku Maharaaj). సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అందించారు.

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్'నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ మూవీ ట్రేడర్స్.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. 'డాకు మహారాజ్'( Daaku Maharaaj )కు తొలిరోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్ అందుకుంది. భారీ ఓపెనింగ్స్ అందుకున్న 'డాకు మహరాజ్' ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.35 కోట్లు అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ( డే 1) రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు, నాలుగవ రోజు రూ. 9.75 కోట్లు, ఐదోవ రోజు రూ. 6.25 కోట్లు, ఆరోవ రోజు రూ. 4.2 కోట్లు అందుకుంది.

తాజాగా డాకు మహారాజ్ ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 124 కోట్లు వసూళ్లు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య వన్ మ్యాన్ షో గా మారారు. ఇక ఏడవ రోజు అంచనా కలెక్షన్స్ వివరాలకు వస్తే.. 'డాకు మహారాజ్' డే 7 కలెక్షన్స్ జోరు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ 7 వరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1.82 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 72.42 కోట్లు వసుళ్లు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ అంచనాలు మార్నింగ్, మాట్నీ షోల వివరాలు మాత్రమే.. మరో రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది.


Click it and Unblock the Notifications











