Daaku Maharaaj Day 8 collections: వీకెండ్ లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలయ్య.. 8వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 8 collections: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబో మూవీ 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం సెట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఈ హై వోల్టేజీ యాక్షన్ మూవీ కలెక్షన్ల పరంగా ఎన్ని కోట్లు కొల్లాగొట్టింది? గత 8 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ సీనియర్ నటులు బాలకృష్ణ హీరోగా.. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). ఈ మాస్ ఎంటర్టైనర్ ను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అదుర్స్.

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనడంతో ఈ మూవీకి 84 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 85 కోట్లుగా మూవీ ట్రేడర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇది బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' నయా రికార్డు క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. 'డాకు మహారాజ్'( Daaku Maharaaj ) పాజిటివ్ టాక్ అందుకోవడంతో తొలి రోజే భారీ ఓపెనింగ్స్ అందుకుంది. అలా 'డాకు మహరాజ్' డే 1 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ తొలి రోజు రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు, 4 వ రోజు రూ. 9.75 కోట్లు, 5 వ రోజు రూ. 6.25 కోట్లు, 6వ రోజు రూ. 4.2 కోట్లు, 7వ రోజు రూ. 4 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా డాకు మహా రాజ్ మొదటివారం లో రూ. 75.5 కోట్లు వసూలు చేసింది. మరోవైపు.. డాకు మహారాజ్ ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 124 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య 'డాకు మహారాజ్' 8 వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 8 collections) వివరాలకు వస్తే.. 'డాకు మహారాజ్' డే 8 కలెక్షన్స్ కాస్త పెరిగాయి. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ 8 వరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 4.20 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 78.80 కోట్లు వసుళ్లు చేసినట్టు తెలుస్తోంది. మెతానికి డాకు మహారాజ్ వీకెండ్ దుమ్మురేపింది. ఈ సినిమా ఆదివారంతో బ్రేక్ ఈవెన్ సాధించి.. లాభాల బాటలో పరుగులు తీస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











