Daaku Maharaaj Day 9 collections: బాక్సాఫీస్ వద్ద బాలయ్య మాస్ జాతర.. డాకు మహారాజ్ 9వ రోజు ఎన్ని కోట్లంటే?
Daaku Maharaaj Day 9 collections: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ
యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ కు పాజివిట్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ హై వోల్టేజీ యాక్షన్ మూవీ కలెక్షన్ల పరంగా ఎన్ని కోట్లు కొల్లాగొట్టింది? గత 9 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాలను అందుకున్న బాలయ్య మంచి ఊపులో ఉన్నాడు. అలాగే.. వరుస విజయాలతో జోరు మీద ఉన్న దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ)ల కాంబో సెట్ కావడంతో డాకుమహారాజ్ సినిమాపై భారీ హైప్ పెరిగాయి. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అదుర్స్.

ఇక 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి 84 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే రూ.85 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాను సుమారుగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇది బాలయ్య తన సినీ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా 'డాకు మహారాజ్' నయా రికార్డు క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. 'డాకు మహారాజ్'(Daaku Maharaaj )తొలి పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.25.35 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ తొలి రోజు రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. రెండవ రోజు రూ. 13.50 కోట్లు, మూడవ రోజు రూ.12.50 కోట్లు, 4 వ రోజు రూ. 9.75 కోట్లు, 5 వ రోజు రూ. 6.25 కోట్లు, 6వ రోజు 4.5 కోట్లు , 7వ రోజు 4 కోట్లు, 8వ రోజు రూ.4.20 కోట్లు రాబట్టింది. ఇలా మొదటి వారంలోనే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సంపాదించింది డాకు మహారాజ్.

సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య 'డాకు మహారాజ్' 9 వ రోజు కలెక్షన్స్ (Daaku Maharaaj Day 9 collections) వివరాలకు వస్తే.. 'డాకు మహారాజ్' డే 9 కలెక్షన్స్ ఘోరంగా పడిపోయాయి. సక్ నిల్క్ అంచనా ప్రకారం.. డాకు మహారాజ్ 9వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 2.50 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'డాకు మహారాజ్' మొత్తం రూ. 80.85 కోట్లు వసుళ్లు చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సెలవులు, వీకెండ్ పూర్తికావడం కలెక్షన్లు పడిపోయాయి. ఈ వారాంత వరకు కలెక్షన్లు ఇలానే ఉండేట్టుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











