Daaku Maharaaj Day 11 Box Office : తడబడుతున్న బాలయ్య .. 11వ రోజు ఎన్ని కోట్లంటే
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాలను నిలబెట్టుకుంటూ సంక్రాంతికి హిట్ బొమ్మ అనిపించుకుంది డాకు మహారాజ్. ఇప్పటికే రూ.160 కోట్ల క్లబ్‌లో చేరిన బాలయ్య 11వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టాడో చూస్తే.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న నందమూరి బాలకృష్ణకు దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) జత కలవడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై బాలయ్య వీరాభిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో డాకు మహారాజ్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూర్చారు.

టీజర్ , ట్రైలర్లు, బాలయ్య గెటప్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే డాకు మహారాజ్‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్.
అటు ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5.40 కోట్లు మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇది ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ . దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే రూ.85 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. రిలీజ్ నాడే హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ తొలి రోజు రూ. 56 కోట్ల రికార్డు ఓపెనింగ్స్ అందుకోగా.. తొలి వారంలోనే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమాను ఇతరు భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే తమిళనాడులో రిలీజైన డాకు మహారాజ్ మంచి హోల్డ్ చూపిస్తోంది. అటు జనవరి 24 నుంచి హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్ర కథ నార్త్‌లో జరుగుతుండటంతో పాటు స్వయంగా బాలయ్యే హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పడం విశేషం. హిందీ బెల్ట్‌లో బాలయ్య ఏ మేర మేజిక్ చేస్తాడో చూడాలి. ఇక 11వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే .. ప్రపంచవ్యాప్తంగా రూ. 1.10 కోట్ల వసూళ్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











