Daaku Maharaaj Day 12 Box Office : కూల్‌గా కొట్టేస్తోన్న బాలయ్య.. 12వ రోజు ఎన్ని కోట్లంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి హిట్ అనిపించుకున్న ఈ సినిమా తొలి వారంలోనే రూ.160 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ 12వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే.
సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో డాకు మహారాజ్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూర్చారు.

టీజర్ , ట్రైలర్లు , బాలకృష్ణ లుక్, థమన్ బీజీఎం తదితర అంశాలతో డాకు మహారాజ్‌పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్లుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్.
అటు ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5.40 కోట్లు మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇది ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ . దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే రూ.85 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో డాకు మహారాజ్ లాభాల్లోకి వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 11 రోజుల వరకు రూ. 1.50 కోట్లకు పైగా షేర్‌ని అందుకున్న ఈ సినిమా .. లాభాలను పంచిపెడుతున్నట్లుగా చెబుతున్నారు. 11 రోజుల్లో నైజాంలో రూ.14.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.7.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.16 కోట్లు, గుంటూరులో రూ. 8 కోట్లు, కృష్ణాలో రూ.5.36 కోట్లు, నెల్లూరులో రూ. 4 కోట్లు , కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.

జనవరి 24 నుంచి హిందీ వెర్షన్‌లో డాకు మహారాజ్ అందుబాటులో రానుండటంతో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 1.77 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లను బాలయ్య రాబడతాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి డాకు మహారాజ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో.


Click it and Unblock the Notifications











