Akhanda 2 Box Office: డిజాస్టర్ దిశగా అఖండ 2.. 50 ఏళ్ల కెరీర్‌లో బాలకృష్ణ అరుదైన రికార్డు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2: తాండవం చిత్రం భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ సినిమా ఆ తర్వాత పూర్తిగా నెగిటివ్ జోన్‌లోకి జారుకోవడంతో వసూళ్ల పరంగా పేలవమైన ప్రదర్శన కొనసాగించింది. అయితే తొలివారంలో తీవ్ర తడబాటుకు గురైన ఈ సినిమా అంతంత మాత్రంగానే కలెక్షన్లను వసూలు చేసింది. అయితే చివరకు అఖండ 2 చిత్రం డిజాస్టర్ వైపు అడుగులేస్తున్నదనే విషయంపై ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ మాత్రం తన 50 ఏళ్ల కెరీర్‌లో ఓ మైలురాయిని అధిగమించాడు. ఆ బాలయ్య సాధించిన ఘనత, అఖండ నాసిరకమైన ప్రదర్శన వివరాల్లోకి వెళితే..
అఖండ చిత్రం భారీ విజయం సాధించడంతో అఖండ 2 సినిమా థియేట్రికల్ బిజినెస్‌పై భారీ అంచనాలు పేరుకుపోయాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మలయాళం, హిందీ భాషలు, అలాగే ఓవర్సీస్ మార్కెట్‌తో కలిపి ఈ సినిమా 103 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసుకొన్నది. ఈ సినిమా 105 కోట్ల రూపాయల షేర్, 210 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

బాలకృష్ణ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన అఖండ 2 చిత్రం కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగేతర రాష్ట్రాల్లో 17.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. తొలి వారం ముగిసే సమయానికే థియేట్రికల్ రన్ ముగించుకొన్నది.
ఇక ఆంధ్రా, నైజాం ప్రాంతాల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా గత 9 రోజుల్లో 80 కోట్లకుపైగా గ్రాస్, 51 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. నైజాంలో 17 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇప్పటి వరకు ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో 60 శాతం మేర రికవరీ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 62 కోట్ల రూపాయల నెట్, 105 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇంకా 43 కోట్ల రూపాయల నెట్, 105 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అఖండ 2 మొత్తంగా భారీ నష్టాలతో ముగిసే అవకాశం ఉంది. కానీ బాలకృష్ణ తన 50 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల మైలురాయిని దాటారు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిజాస్టర్ టాక్‌తో కూడా బాలయ్య 100 కోట్ల గ్రాస్ సాధించడంపై అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.


Click it and Unblock the Notifications











