బాలకృష్ణ భారీ రెమ్యునరేషన్.. అఖండ 2కు ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్లతో టాలీవుడ్ లో సంచలనంగా మారారు. ఆరు పదుల వయస్సులోనూ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. దీంతో ప్రేక్షకుల నుంచి కూడా బాలయ్య నుంచి రాబోయే చిత్రాలకు భారీ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అఖండ 2తో నెక్ట్స్ అలరించేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. కాగా ఈ చిత్రానికి బాలకృష్ణ తీసుకున్న రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంతో పోల్చితే బాలయ్య తన పారితోషికాన్ని 40 శాతానికి పెంచారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్..
నందమూరి నటసిహం చిత్రాలకు ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉండింది. అందుకు తగట్టుగానే బాలకృష్ణ తన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియెన్స్ తో థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నారు. కాగా బాలయ్య చివరిగా 4 చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకున్నారు. 2021లో వచ్చిన 'అఖండ' మొదలు, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్ వంటి చిత్రాలతో వరుసగా హిట్ అందుకున్నారు. అఖండ తర్వాత నుంచి బాలయ్య సినిమాలకు మరింత డిమాండ్ పెరిగింది.

అఖండ 2, రెమ్యునరేషన్ పెంచేసిన బాలయ్య..
అఖండ చిత్రంతో 2021లో భారీ హిట్ అందుకున్న తర్వాత బాలయ్య సెకండ్ ఇన్నింగ్ మరింత ఊపందుకుంది. దానికి తోడు వరుసగా సినిమాలు విజయవంతం అవుతుండటంతో బాలయ్య తన పారితోషికాన్ని ఏకంగా 40 శాతానికి పెంచినట్టు తెలుస్తోంది. చివరి చిత్రం 'డాకూ మహరాజ్' కు రూ.27 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య ఇక అఖండ 2కు మాత్రం ఏకంగా రూ.45 కోట్ల వరకు ఛార్జ్ చేశారంట. మరోవైపు ఈ చిత్రంపైనా డిమాండ్ ఉండటంతో పారితోషికాన్ని హైక్ చేశారని సినీ నిపుణులు అంటున్నారు.
అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు..
2021లో బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'అఖండ'. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం రూ.60కోట్లతో రూపుదిద్దుకుంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మాత్రం రూ.150 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అవ్వడం విశేషం. రీసెంట్ గా ఈ చిత్రానికి గద్దర్ అవార్డ్ కూడా దక్కింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా 'అఖండ 2' రూపుదిద్దుకుంటోంది. అఖండ రుద్ర సికిందర్ అఘోర, మురళీ శర్మ అనే ద్విపాత్రాభినయంతో మరోసారి అలరించబోతున్నారు. కాగా తాజాగా టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. విజువల్స్ అదిరిపోయాయి. బాలయ్య అఘోర లుక్ మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. దీంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
అఖండ 2 తర్వాత బాలకృష్ణ ఎలాంటి ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఓవైపు బాలయ్య మలయాళ చిత్రం 'మార్కో' డైరెక్టర్ హనీఫ్ తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల్లోనే ఉంది. మరోవైపు బాలయ్య 'జైలర్ 2'లో కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకోవడం విశేషం. అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











