Bhagavanth Kesari Collections భగవంత్ కేసరికి పాజిటివ్ టాక్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ భగవంత్ కేసరి. ఈ దసరా బరిలో నిలిచిన సినిమాల్లో భగవంత్ కేసరి ఒకటి. అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ బాలకృష్ణ హీరోగా రావడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీగానే అంచనాలున్నాయి. బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్ కథాంశం, భీకరమైన ఫైట్లు, స్క్రీన్ నిండా రక్తపాతం.. దర్శకుడు అనిల్ రావిపూడి పేరు చెప్పగానే కామెటీ కంటెంట్, కడుపుబ్బా నవ్వించి కడుపునొప్పితో థియేటర్ నుంచి బయటకు రావడమే గుర్తొస్తుంది.

అలాంటి వీరిద్దరి కాంబో అనగానే ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. బాలయ్య బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీ గురువారం రోజు విడుదలైంది.

Nandamuri Balakrsihna ANil Ravipudi Bhagavanth Kesari Movie Worldwide Box Office Day 1 Collections

తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టాల్సిందేనని బాలకృష్ణ ఓ ఈవెంట్ లో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కామెడీ, యాక్షన్ తో పాటు ఈ సినిమాలో ఎమోషన్ కూడా చాలా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. మరి మొదటి రోజు భగవంత్ కేసరి కలెక్షన్లు ఎలా ఉన్నాయి. ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి. మొదటి రోజు గ్రాస్ ఎంత వరకు కలెక్ట్ చేయవచ్చో ఈ లుక్కేద్దామా...!

మొదటి రోజు సినీ ప్రేక్షకులను బాగానే కలెక్షన్లను రాబట్టేలా కనిపిస్తోంది భగవంత్ కేసరి. సినీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం మొదటి రోజు మంచి వసూళ్లు రాబడుతుందని, మూవీ మిక్స్‌డ్ టాక్ వస్తుండటంతో లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లతో నెట్టుకొస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు 14 కోట్ల వరకు వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.

Nandamuri Balakrsihna ANil Ravipudi Bhagavanth Kesari Movie Worldwide Box Office Day 1 Collections

మొదటి రోజు మార్నింగ్ షోకు హైదరాబాద్ లో 65 శాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. బెంగళూరు లో మార్నింగ్ షో 66 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. విజయవాడలో 81 శాతం ఆక్యుపెన్సీ, గుంటూరు లో 90 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. విశాఖపట్నంలో 68 శాతం, కాకినాడలో 67 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. దీన్ని బట్టి మొదటి రోజు భగవంత్ కేసరి గట్టిగానే వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X