Don't Miss!
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- News జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!!
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Bimbisara 22 Days Collections: బింబిసారకు లైగర్ ఎఫెక్ట్.. తగ్గిన కలెక్షన్లు.. 22వ రోజున వచ్చింది ఎంతంటే?
బాల గోపాలుడు చిత్రంతో బాలనటుడిగా పరిచయమయ్యాడు నందమూరి కల్యాణ్ రామ్. 2003లో వచ్చిన తొలి చూపులోనే సినిమాతో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతోపాటు తర్వాత వచ్చిన అభిమన్యు మూవీ కూడా అంతగా పేరు తీసుకురాలేదు. 2005లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా, హీరోగా తెరకెక్కించిన అతనొక్కడే మూవీతో మాసీవ్ హిట్ కొట్టాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాతో సురేందర్ రెడ్డిని డైరెక్టర్‌గా పరిచయం చేసిన కల్యాణ్ రామ్ అప్పటినుంచి విభిన్నమైన కథలను రూపొందిస్తూ కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. అలా వశిష్ఠ అనే కొత్త డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన చిత్రం బింబిసార. మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ మూవీ 22 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంతో చూద్దామా!
బింబిసారగా కల్యాణ్ నట విశ్వరూపం
క్రూరమైన రాజుగా కల్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపించిన చిత్రం బింబిసార. ఈ మూవీతో మల్లిడి వశిష్ఠ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. సోషియో ఫాంటసీ జోనర్లో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్
కల్యాణ్ రామ్ మార్కెట్‌కు తగినట్లుగా 'బింబిసార' చిత్రానికి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగింది.
22వ రోజు ఎక్కడ? ఎంత వచ్చిందంటే?
కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన బింబిసార చిత్రం 22వ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 8 లక్షల రేంజ్ షేర్‌ను సొంతం చేసుకుంది. అలాగే కేవలం ఒక 22వ రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ. 9 లక్షల రేంజ్లో వసూళ్లు సాధించింది. 'బింబిసార' మూవీ 22 రోజులకు వచ్చేసరికి కొద్దిమేర తగ్గాయి. ఎందుకంటే లైగర్ మూవీతో పలు థియేటర్లలో బింబిసారను తొలగించే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇక 22 రోజులకు కలిపి వచ్చింది ఎంతంటే?
బింబిసార చిత్రానికి 22వ రోజులకు మొత్తంగా కలిపి.. నైజాంలో రూ. 11.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.80 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.42 కోట్లు, గుంటూరులో రూ. 2.20 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 92 లక్షలతో కలిపి రూ. 32.11 కోట్లు షేర్, రూ. 51.22 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?
22 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 32.11 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.27 కోట్లు, ఓవర్సీస్లో రూ. 2.33 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 22 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 36.71 కోట్లు షేర్‌తో పాటు రూ. 62.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
సోషియో ఫాంటసీ నేపథ్యంతో రూపొందిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.21 కోట్లుగా నమోదైంది. ఇక, 22 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 36.71 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.51 కోట్లు లాభాలు కూడా దక్కాయి.
లైగర్ ఎఫెక్ట్!
అయితే బింబిసార సినిమాకు లైగర్ ఎఫెక్ట్ పడింది. ఆగస్టు 25న విడుదలైన లైగర్ చిత్రంతో బింబిసార కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. బింబిసార మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 21వ రోజున రూ. 10 లక్షలు వసూలు అయితే 22వ రోజున రూ. 8 లక్షలు రాబట్టనట్లు తెలుస్తోంది.