twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న మంచోడు.. మొదటి రోజు ఎంత కలెక్ట్ చేశాడంటే..?

    |

    మాస్ ఇమేజ్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్.. పూర్తిగా తన పంథాను మార్చుకుని చేసిన చిత్రం ఎంత మంచివాడవురా. శతమానంభవతి లాంటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నచిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్నతో చేసిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇది గుజరాతీ సినిమాకు రీమేకే అయినప్పటికీ ఎక్కడా అలా అనిపించదు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా కథలో మార్పులు, చేర్పులు చేసి ఎంతో అందంగా తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది.

     హాయిగా, ఆహ్లాదకరంగా అనిపించే కథ..

    హాయిగా, ఆహ్లాదకరంగా అనిపించే కథ..

    ఎటువంటి సంఘర్షణలు, రక్తపాతాలు, గొడవలు, అశ్లీలత అంటూ ఏమీ లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఎంత మంచివాడవురా ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మెప్పించే అవకాశం ఉంది. మాస్ అంశాలతో కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించకపోయినా.. అక్కడకక్కడ మాస్ ఎలిమెంట్స్‌ను జొప్పించే ప్రయత్నం చేశారు.

     గట్టిపోటీలోనూ..

    గట్టిపోటీలోనూ..

    సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి భారీ బడ్జెట్ చిత్రాలు, బడా హీరోల సినిమాలు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న వేళ.. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అంటూ వచ్చాడు. ఆ రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇలాంటి సమయంలో ఎంత మంచివాడవురా రావడం కాసింత నష్టాన్ని కలిగించే విషయమే.

    డీసెంట్ కలెక్షన్లతో..

    డీసెంట్ కలెక్షన్లతో..

    ఇంతటి కఠిన సమయంలోనూ ఎంత మంచివాడవురా డీసెంట్ కలెక్షన్లే వసూళ్లు చేశాడు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2.2కోట్ల షేర్, ప్రపంచ వ్యాప్తంగా 2.56కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా 4కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

    ఏరియాలా వారిగా..

    ఏరియాలా వారిగా..

    ఏరియాలా వారిగా కలెక్షన్ల వివరాలు చూస్తే.. నైజాంలో 66లక్షలు, సీడెడ్‌లో 38లక్షలు, ఉత్తరాంధ్రలో 18.4లక్షలు, ఈస్ట్ 30లక్షలు, వెస్ట్ 20లక్షలు, గుంటూరు 20లక్షలు, కృష్ణా 19లక్షలు, నెల్లూరు 9లక్షలు ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 2.2కోట్లు వసూల్ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 2.56కోట్ల షేర్ (4.35 కోట్ల గ్రాస్)ను రాబట్టింది.

    English summary
    Nandamuri Kalyan Ram Entha Manchivaadavuraa First Day Collections. Entha Manchivaadavuraa is a 2020 Indian Telugu-language action drama film directed by Satish Vegesna. An official remake of the Gujarati-language film Oxygen, it stars Kalyan Ram and Mehreen Pirzada in the lead roles, with the music composed by Gopi Sundar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X