Kalyan Ram : కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్, ఆస్తుల నికర విలువ.. వరుస నష్టాల్లోనూ ఎంత సంపాదించాడంటే?

నందమూరి నటవారసుడు, టాలీవుడ్ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ తాజాగా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun Son of Vyjayanthi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటి విజయ్ శాంతి కళ్యాణ్ రామ్ కు ఈ చిత్రంలో తల్లి పాత్రలో నటించడం విశేషం. ఏప్రిల్ 18న చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూస్తారంటూ ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో చెప్పడంతో సినిమా హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక కళ్యాణ్ రామ్ కెరీయర్ లో భారీ పరాజయాలను చూసి ఎట్టకేళలకు 'బింబిసార'తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చివరిగా 'అమిగోస్', 'డెవిల్' వంటి చిత్రాలతో అలరించాడు. ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక సినిమాను అశోకా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలసు నిర్మాతలుగా వ్యవహరించారు.

Nandamuri Kalyan Ram Net Worth

ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా నందమూరి హీరో, జూ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఆస్తుల విలువ ఎంతుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్ రామ్ 2003 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. నటుడిగా నందమూరి అభిమానులతో పాటు తెలుగు ఆడియెన్స్ మెప్పించారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు 23 చిత్రాల్లో నటించారు. మరోవైపు ఎన్టీఆర్ట్స్ బ్యానర్ ద్వారా పలు చిత్రాలను నిర్మిస్తూనే వస్తున్నారు. ఇలా నటుడిగా, ప్రొడ్యూసర్ గా ఓ మాదిరిగా సంపాదిస్తూనే ఉన్నారు.

అయితే, కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆయన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎంత సంపాదించారనే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ కు ఉన్న మార్కెట్ ను బట్టి ఆయన ఒక్కో సినిమాకు 6 నుంచి 8 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే ఆయన సినిమాలకు దాదాపు ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. దాంతో సినిమా హిట్టా? ఫట్టా? అన్నదానిపై కళ్యాణ్ రామ్ ఆదాయం ఆధారపడి ఉంది. కెరియర్ లో ఎన్నో నష్టాలను చూసిన ఆయన కాస్తా కూడబెట్టారు కూడా.

కళ్యాణ్ రామ్ కెరియర్ మొత్తంలో రూ.119 కోట్ల వరకు నికర ఆదాయం కలిగి ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ట్స్ బ్యానర్, అద్వితా క్రియేటివ్ స్టూడియో అనే వీడియో ఎఫెక్ట్స్ కంపెనీ కూడా ఉంది. వీటి ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు. ఇక హైదరాబాద్ లో ఒక ఇల్లు, కార్లు కలిగి ఉన్నారు. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'దేవర' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకుంది. నెక్ట్స్ 'దేవర 2’ కూడా రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X