Devil 2 Days Collections: డెవిల్‌కు మరో దెబ్బ.. 2 రోజుల్లో దారుణంగా.. అసలు ఎన్ని కోట్లు రావాలంటే!
టాలీవుడ్‌లోనే పెద్ద పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఆరంభంలో కమర్షియల్ సినిమాలు చేసిన అతడు.. కొంత కాలంగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఇలా సఫలీకృతం కూడా అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు కల్యాణ్ రామ్ 'డెవిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్ పాజిటివ్‌గానే వచ్చినా రెస్పాన్స్ మాత్రం ఆశించినట్లుగా రావట్లేదు. కానీ, రెండో రోజు బానే రాణించింది. మరి 'డెవిల్' మూవీ రెండు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

డెవిల్‌గా వచ్చేసిన కల్యాణ్: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా.. అభిషేక్ నామా తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'డెవిల్'. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ఇచ్చాడు. దీనిలో మాళవిక నాయర్, అజయ్, సత్య కీలక పాత్రలు పోషించారు.

డెవిల్ ప్రీ బిజినెస్ డీటేల్స్: నందమూరి కల్యాణ్ రామ్ 'డెవిల్' మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దీంతో నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.00 కోట్లతో కలిపి రూ. 20.10 కోట్ల బిజినెస్ జరిగింది.
రెండో రోజు ఎంత రాబట్టింది?: 'డెవిల్'కు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు వసూళ్లు అదే రీతిలో వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 61 లక్షలు, సీడెడ్‌లో రూ. 27 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 1.40 కోట్లు షేర్, రూ. 2.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

2 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?: 'డెవిల్'కు రెండు రోజులకు కలిపి ఓ మోస్తరు వసూళ్లే దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 58 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 31 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి.. రూ. 3.18 కోట్లు షేర్, రూ. 6.30 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీకి 2 రోజుల్లో రూ. 3.18 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 60 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 4.13 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21.00 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 4.13 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 16.83 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.
రెండో రోజు ఇంత తక్కువగా: కల్యాణ్ రామ్ - అభిషేక్ నామా కాంబినేషన్‌లో రూపొందిన 'డెవిల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 4.13 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. ఇది ఈ నందమూరి హీరో రేంజ్‌కు చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక, కల్యాణ్ డిజాస్టర్ మూవీ'అమిగోస్' అయితే రెండు రోజుల్లో రూ. 3.82 కోట్లు రాబట్టింది. దీనిని బీట్ చేసినా ఇవి చాలా తక్కువ అనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











