Devil 3 Days Collections: డెవిల్‌కు దిమ్మతిరిగే వసూళ్లు.. సండే కూడా ఇంతే.. కల్యాణ్ రామ్‌కు షాక్
తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ ఒకడు. దీనికితోడు ఈ మధ్య కాలంలో అతడు వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు.
గత చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని 'డెవిల్' అనే మూవీని చేశాడు. కానీ, దీనికి మాత్రం ప్రేక్షకుల స్పందన అనుకున్నట్లుగా రావడం లేదు. దీంతో కలెక్షన్లు కూడా చాలా తక్కువగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ మూడు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

డెవిల్‌గా కల్యాణ్ అరాచకం: నందమూరి కల్యాణ్ రామ్ - అభిషేక్ నామా కాంబోలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'డెవిల్'. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ఇచ్చాడు. దీనిలో మాళవిక నాయర్, అజయ్, సత్య కీలక పాత్రలు చేశారు.

డెవిల్ ప్రీ బిజినెస్ డీటేల్స్: కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దీంతో నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.00 కోట్లతో కలిపి రూ. 20.10 కోట్ల బిజినెస్ అయింది.

మూడో రోజు ఎంతొచ్చింది: నందమూరి కల్యాణ్ హీరోగా అభిషేక్ నామా రూపొందించిన 'డెవిల్' మూవీకి మూడో రోజు హాలీడే ఉన్నా రెస్పాన్స్ ఆశించిన విధంగా రాలేదు. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1 కోటి వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 1.30 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనిపై పూర్తి సమాచారం కాసేపట్లో అప్‌డేట్ చేస్తాము.


Click it and Unblock the Notifications











