Devil Day 1 Collections: డెవిల్‌కు ఊహించని వసూళ్లు.. కల్యాణ్ రామ్‌కు బిగ్ షాక్.. ఆ ఫ్లాప్ మూవీ కంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. పెద్దగా హిట్లను అందుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో 'బింబిసార'తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. ఆ వెంటనే మరో షాక్ తిన్నాడు.

దీంతో ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో 'డెవిల్' మూవీతో వచ్చాడు. దీనికి టాక్ బాగున్నా రెస్పాన్స్ అంతగా రాలేదని తెలిసింది. మరి కల్యాణ్ రామ్ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో మీరు కూడా చూసేయండి మరి!

Nandamuri Kalyan Ram Starrer Devil Movie Worldwide Day 1 Worldwide Collections

డెవిల్‌గా ఎంటరైన కల్యాణ్: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'డెవిల్'. అభిషేక్ నామా తెరకెక్కించిన మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఈ మూవీలో మాళవిక నాయర్, అజయ్, సత్య కీలక పాత్రలు చేశారు.

Nandamuri Kalyan Ram Starrer Devil Movie Worldwide Day 1 Worldwide Collections

డెవిల్ ప్రీ బిజినెస్ డీటేల్స్: కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దీంతో నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.00 కోట్లతో కలిపి రూ. 20.10 కోట్ల బిజినెస్ చేసింది.

Nandamuri Kalyan Ram Starrer Devil Movie Worldwide Day 1 Worldwide Collections

అలాంటి టాక్‌తో రెస్పాన్స్: ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'డెవిల్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా డీసెంట్‌గానే వచ్చాయి. దీనికితోడు మరికొన్ని సినిమాల నుంచి పోటీ ఉండడంతో దీనికి రెస్పాన్స్‌తో ఆశించిన రీతిలో రాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం.

తొలి రోజు ఎంత రాబట్టింది?: 'డెవిల్'కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అనుకున్న రేంజ్‌లో వసూళ్లు రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 70 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 1.68 కోట్లు షేర్, రూ. 3.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 1.68 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 2.28 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.82 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 2.28 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 18.72 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

ఆ ఫ్లాప్ మూవీ కంటే తక్కువ: కల్యాణ్ రామ్ - సంయుక్త మీనన్ కాంబినేషన్‌లో రూపొందిన 'డెవిల్' మూవీకి తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.68 కోట్లు షేర్ వచ్చింది. ఇది అతడి గత చిత్రాల కంటే చాలా తక్కువ అనే చెప్పాలి. కల్యాణ్ కెరీర్‌లో 'బింబిసార' రూ. 6.30 కోట్లు సాధించి టాప్‌లో నిలవగా.. 'ఇజం' రూ. 3.09 కోట్లు, MLA రూ. 2.72, 'అమిగోస్' రూ. 2.03 కోట్లు వసూలు చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X