Devil Business: డెవిల్ మూవీకి రికార్డు బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే కల్యాణ్ రామ్‌కు హిట్
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయినా.. కష్టపడేతత్వంతో చాలా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి చిన్నోడు కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభం నుంచీ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోన్న అతడు 'బింబిసార'తో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో 'డెవిల్' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ మూవీకి థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందో మీరే చూసేయండి మరి!
డెవిల్‌గా వస్తున్న కల్యాణ్ రామ్:నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రమే 'డెవిల్'. అభిషేక్ నామా తెరకెక్కించిన మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీలో అజయ్, సత్య తదితరులు కీలక పాత్రలను చేశారు.

అలాంటి స్టోరీతో.. థ్రిల్లర్‌గానే:నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రమే 'డెవిల్'. బ్రిటీష్ కాలం నాటి కథతో రూపొందిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుంది. ఇందులో ఓ హత్య జరగడం.. దానిని చేధించేందుకు సీక్రెట్ ఏజెంట్ ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్టుతో ఇది తెరకెక్కింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
ప్రమోషన్స్ షురూ... సందడి:కల్యాణ్ రామ్ - సంయుక్త మీనన్ కాంబినేషన్‌లో రూపొందిన 'డెవిల్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఇక, గురువారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఈ మూవీ సందడి కనిపిస్తోంది.

ఏపీ, తెలంగాణలో బిజినెస్:కల్యాణ్ రామ్ 'డెవిల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్:'అమిగోస్' పరాజయం తర్వాత కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' మూవీ థియేట్రికల్ హక్కుల కోసం పోటీకి తగ్గట్లుగానే బిజినెస్ భారీ స్థాయిలో జరిగిపోయింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2.00 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 20.10 కోట్లు మేర వ్యాపారం అయింది.

అన్ని కోట్లు వస్తేనే సక్సెస్:నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఆశించిన దానికంటే ఎక్కువగానే బిజినెస్ జరిగింది. ఇక, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 20.10 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ చేరుతుంది.
కల్యాణ్ రామ్ కెరీర్‌లో టాప్:కల్యాణ్ రామ్‌కు మీడియం రేంజ్ బిజినెస్ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. అందుకే అతడి చిత్రాలకు ఇప్పటి వరకూ రూ. 20 కోట్లు బిజినెస్ మాత్రమే జరిగాయి. కానీ, ఇప్పుడు రాబోతున్న 'డెవిల్' చిత్రానికి మాత్రం రికార్డు స్థాయిలో రూ. 20.10 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది. తద్వారా అతడి కెరీర్‌లో అత్యధిక బిజినెస్ చేసుకున్న సినిమాగా ఇది రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











