Shyam Singha Roy's Day 1 Collections.. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా.. ఫస్ట్ డే బాక్సాఫీస్ ధమాకా!
నేచురల్ స్టార్ నాని, అందం, అభినయంతో ఆకట్టుకొనే సాయిపల్లవి జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్‌లో రిలీజైంది. వీ, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది. ఇలాంటి పరిస్థితులు, రకరకాల వివాదాల మధ్య సినిమా హాళ్లలోకి వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఏ మేరకు వసూళ్లు సాధించిందంటే..

60 కోట్ల బడ్జెట్‌తో
విభిన్నమైన కథ, నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్ లాంటి నటీనటులు అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ కలయిక వస్తుందని ప్రచారం జరగడంతో మూవీపై భారీ అంచనాలు పేరుకుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 థియేటర్లలో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా స్క్రీన్లలో రిలీజైంది. ఇది నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని చెప్పుకొంటున్నారు. అయితే ఈ మూవీ సుమారు 60 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. రిలీజ్ తర్వాత ఈ సినిమాపై డివైడ్ టాక్ ఉండటంతో సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయనే విషయం ఆసక్తిగా మారింది.

తొలి రోజు యూఎస్ ప్రీమియర్ల వసూళ్లు
శ్యామ్ సింగరాయ్ చిత్రం రిలీజ్‌కు ఒక రోజు ముందే అమెరికాలో ప్రీమియర్లను ప్రదర్శించారు. అయితే ఈ ప్రీమియర్లకు ఓ మోస్తారుగా రెస్పాన్స్ లభించింది. సుమారు 195 లొకేషన్లలో ఈ సినిమా 133,016 అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమా రాబట్టిన వసూళ్లు ఇంకా అందాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు రాబట్ట వచ్చని అంచనా వేస్తున్నారు.

నైజాం, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కలెక్షన్లు
టాలీవుడ్‌కు అడ్డాగా మారిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో శ్యామ్ సింగరాయ్ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. తొలి రోజు అన్ని షోలు హౌస్‌పుల్‌ను నమోదు చేశాయి. దాంతో ఈ చిత్రం 6,34,278 రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. హైదరాబాద్‌లో దాదాపు 283 షోలు ప్రదర్శించారు. నైజాంలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఆంధ్రాలో తొలి రోజు కలెక్షన్లు
శ్యామ్ సింగరాయ్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో జీఎస్టీతో కలిసి 2 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. సీడెడ్‌లో 62 లక్షలు, ఉత్తరాంధ్రలో 51 లక్షలు వసూలు చేసింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రూ.20 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 16 లక్షలు, గుంటూరు జిల్లాలో 26 లక్షలు, కృష్ణా జిల్లాలో 18 లక్షలు, నెల్లూరులో 12 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4.20 కోట్లు నికరంగా, సుమారు 7 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..
ఇక కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో శ్యామ్ సింగరాయ్ చిత్రం 1.30 కోట్లు రాబట్టింది. అమెరికాలో ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రిమియర్ షో ద్వారా 133,000 అమెరికన్ డాలర్లు, 123,000 డాలర్లతో మొత్తం 256,000 డాలర్లు అంటే 1.93 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శ్యామ్ సింగరాయ్ 6.82 కోట్లు నికరంగా, 12 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











