Ante Sundaraniki Collections: నానికి కలిసొచ్చిన లక్.. 4 రెట్లు పెరిగిన వసూళ్లు.. ఈ లెక్కలు చూస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సహజ సిద్ధమైన నటనతో గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నేచురల్ స్టార్ నాని ఒకడు. బ్యాగ్రౌండ్ లేకున్నా సినిమాల్లోకి వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో హిట్లను సొంతం చేసుకున్నాడు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాని ఇటీవలే 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

సుందరంగా మారిపోయిన నాని
నేచురల్ స్టార్ నాని - నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రమే 'అంటే.. సుందరానికీ!'. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్, నదియా తదితరులు కీలక పాత్రలు చేశారు.

నాని మూవీకి ఓ రేంజ్ బిజినెస్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 30 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నాని హీరోగా నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ మంచిగా వచ్చాయి. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణలో 9వ రోజు రూ 15 లక్షలే వసూలు అయ్యాయి. అయితే, 10వ రోజు మాత్రం భారీగా పెరిగి రూ. 67 లక్షలు వచ్చాయి.

10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
ఏపీ, తెలంగాణలో 'అంటే.. సుందరానికీ!' 10 రోజుల్లో కలెక్షన్లు ఇలా వచ్చాయి. నైజాంలో రూ. 5.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.58 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 98 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 83 లక్షలు, గుంటూరులో రూ. 91 లక్షలు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 60 లక్షలతో.. రూ. 12.98 కోట్లు షేర్, రూ. 21.95 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 12.98 కోట్లు వసూలు చేసిన 'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.55 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 20.08 కోట్లు షేర్‌తో పాటు రూ. 35.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
రొమాంటిక్ జోనర్‌లో వచ్చిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 20.08 కోట్లు వచ్చాయి. అంటే మరో 10.92 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











