Ante Sundaraniki Collections: 31 కోట్ల టార్గెట్.. వారంలో ఘోరంగా.. అన్ని కోట్లు వస్తేనే మూవీ హిట్

సహజసిద్ధమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని. బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలు అందుకున్నాడు. తద్వారా స్టార్‌డమ్‌తో పాటు మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే నాని గత వారమే 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు టాక్ మంచిగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం నిరాశనే మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అంటే.. సుందరానికీ!' సినిమా వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అంటే.. సుందరానికీ! అంటూ నాని

అంటే.. సుందరానికీ! అంటూ నాని


నేచురల్ స్టార్ నాని - నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రమే 'అంటే.. సుందరానికీ!'. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్, నదియా తదితరులు కీలక పాత్రలను చేసిన విషయం తెలిసిందే.

నాని సినిమాకు ఓ రేంజ్ బిజినెస్

నాని సినిమాకు ఓ రేంజ్ బిజినెస్

భారీ అంచనాలతో తెరకెక్కిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 30 కోట్ల బిజినెస్ అయింది.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ కలెక్షన్లు మంచిగానే వచ్చాయి. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు పడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడో రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలుపుకుని కేవలం రూ. 18 లక్షలు వసూలు అయ్యాయి.

ఫస్ట్ వీక్‌‌లో ఎంత వసూలైంది?

ఫస్ట్ వీక్‌‌లో ఎంత వసూలైంది?

రెండు రాష్ట్రాల్లో 'అంటే.. సుందరానికీ!' వారంలో తక్కువ కలెక్షన్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 93 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 79 లక్షలు, గుంటూరులో రూ. 87 లక్షలు, కృష్ణాలో రూ. 84 లక్షలు, నెల్లూరులో రూ. 58 లక్షలతో.. రూ. 12.05 కోట్లు షేర్, రూ. 20.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 12.05 కోట్లు వసూలు చేసిన నాని'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.34 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 18.39 కోట్లు షేర్‌తో పాటు రూ. 32.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

ఫన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 18.39 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.61 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X