Ante Sundaraniki Collections: 2వ రోజు ఊహించని వసూళ్లు.. 30 కోట్లకు వచ్చింది ఇంతే.. ఇంకెత రావాలంటే!

నేచురల్ స్టార్ నాని.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన శైలి సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యాక్టింగ్‌ మాత్రమే కాదు.. డైలాగ్స్, ఫైట్స్ అన్నింటికీ మించి కామెడీ టైమింగ్‌తో మాయ చేస్తున్నాడు. ఇలా విభిన్నమైన చిత్రాలతో ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే నాని తాజాగా 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి మొదటి రోజు సాదాసీదా కలెక్షన్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'అంటే.. సుందరానికీ!' సినిమా రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

 ‘అంటే.. సుందరానికీ!' వచ్చాడు

‘అంటే.. సుందరానికీ!' వచ్చాడు

టాలీవుడ్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రమే 'అంటే.. సుందరానికీ!'. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో నరేష్, నదియా తదితరులు కీలక పాత్రలను పోషించారు.

 భారీ అంచనాలు.. బిజినెస్ ఇలాగ

భారీ అంచనాలు.. బిజినెస్ ఇలాగ


నాని నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది.

రెండో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

రెండో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


'అంటే.. సుందరానికీ!'కి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజూ అదే స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 38 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. రూ. 3.48 కోట్లు షేర్, రూ. 5.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

2 రోజులకూ కలిపి ఎంత వచ్చింది

2 రోజులకూ కలిపి ఎంత వచ్చింది


2 రోజుల్లోనూ ఏపీ, తెలంగాణలో 'అంటే.. సుందరానికీ!' బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 75 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, కృష్ణాలో రూ. 51 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో.. రూ. 7.35 కోట్లు షేర్, రూ. 12.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 7.35 కోట్లు వసూలు చేసిన నాని'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 10.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 18.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లోనే దీనికి రూ. 10.60 కోట్లు వచ్చాయి. అంటే మరో 20.40 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X