For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ante Sundaraniki Collections: నానికి బిగ్ షాక్.. 6వ రోజు ఘోరంగా.. అన్ని కోట్లు వస్తేనే మూవీ హిట్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని చాలా కాలంగా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు టాలెంటెడ్ హీరో నాని. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో విజయాలను అందుకుని కమర్షియల్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి టాక్ మంచిగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో 'అంటే.. సుందరానికీ!' సినిమా 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    అంటే.. సుందరానికీ!.. వచ్చాడిలా

    అంటే.. సుందరానికీ!.. వచ్చాడిలా

    నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమే 'అంటే.. సుందరానికీ!'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్, నదియా తదితరులు నటించారు.

    బ్రాతో పునర్నవి హాట్ సెల్ఫీ: నేను ఆ పని చేయడానికే వచ్చానా అంటూ!

    నాని సినిమాకు ఓ రేంజ్ బిజినెస్

    నాని సినిమాకు ఓ రేంజ్ బిజినెస్

    ఎన్నో అంచనాలతో వచ్చిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 30 కోట్ల బిజినెస్ జరిగింది.

    6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'అంటే.. సుందరానికీ!'కి తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు కలెక్షన్లు తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. బుధవారం రూ. 30 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    డార్క్ రూమ్‌లో బ్రాతో పాయల్: ఈ ఫోజు చూసి తట్టుకోవడం కష్టమే

    6 రోజులకూ కలిపి ఎంత వచ్చింది

    6 రోజులకూ కలిపి ఎంత వచ్చింది

    6 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 'అంటే.. సుందరానికీ!' తక్కువ కలెక్షన్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 93 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 79 లక్షలు, గుంటూరులో రూ. 86 లక్షలు, కృష్ణాలో రూ. 83 లక్షలు, నెల్లూరులో రూ. 57 లక్షలతో.. రూ. 11.87 కోట్లు షేర్, రూ. 20.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది


    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరు రోజుల్లో రూ. 11.87 కోట్లు వసూలు చేసిన నాని'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 17.97 కోట్లు షేర్‌తో పాటు రూ. 31.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

    టెలివిజన్ స్టార్‌తో యాంకర్ వర్షిణి నైట్ పార్టీ: గట్టిగా వాటేసుకుని.. ఏదో తేడాగా ఉందేంటబ్బా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    క్రేజీ కాంబోలో వచ్చిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజుల్లోనే దీనికి రూ. 17.97 కోట్లు వచ్చాయి. అంటే మరో 13.03 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Natural Star Nani Did Ante Sundaraniki Movie Under Vivek Athreya Direction. This Movie Collect 17.97 Cr in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X