twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ante Sundaraniki Collections: శనివారం కలెక్షన్లు డబుల్.. అయినా నానికి నిరాశే.. ఇంకెంత రావాలంటే!

    |

    స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు టాలెంటెడ్ గాయ్ నాని. నేచురల్ యాక్టింగ్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన అతడు.. నేచురల్ స్టార్ అనే బిరుదుతో పాటు ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు. దీంతో స్టార్‌డమ్‌ను, మార్కెట్‌ను మరింత పెంచుకున్నాడు. ఇక, ఇటీవలే 'శ్యామ్ సింగ రాయ్'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన నాని.. తాజాగా 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ ఉన్నా కలెక్షన్లు అంతగా రావట్లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    నాని.. మరో వినూత్న ప్రయోగం

    నాని.. మరో వినూత్న ప్రయోగం

    టాలీవుడ్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమే 'అంటే.. సుందరానికీ!'. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్, నదియా తదితరులు కీలక పాత్రలను పోషించారు.

    హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులుహాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులు

    నాని మూవీకి ఓ రేంజ్ బిజినెస్

    నాని మూవీకి ఓ రేంజ్ బిజినెస్

    రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 30 కోట్ల బిజినెస్ జరిగింది.

    9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'అంటే.. సుందరానికీ!' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ కలెక్షన్లు మంచిగానే వచ్చాయి. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు పడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణలో 8వ రోజు రూ 11 లక్షలే వసూలు అయ్యాయి. అయితే, 9వ రోజు మాత్రం కాసింత పెరిగి రూ. 15 లక్షలే వచ్చాయి.

    మళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోతమళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోత

    9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?

    9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?

    రెండు రాష్ట్రాల్లో 'అంటే.. సుందరానికీ!' 9 రోజుల్లో తక్కువ కలెక్షన్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.37 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 89 లక్షలు, కృష్ణాలో రూ. 86 లక్షలు, నెల్లూరులో రూ. 58 లక్షలతో.. రూ. 12.31 కోట్లు షేర్, రూ. 20.85 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొమ్మిది రోజుల్లో రూ. 12.31 కోట్లు వసూలు చేసిన 'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 18.91 కోట్లు షేర్‌తో పాటు రూ. 33.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

    హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    నాని - నజ్రియా జంటగా నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 18.91 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.44 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Natural Star Nani Did Ante Sundaraniki Movie Under Vivek Athreya Direction. This Movie Collect 18.91 Cr in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X