Ante Sundaraniki Collections: 30 కోట్ల బిజినెస్, క్లోజింగ్ టైంకి ఎన్ని కోట్ల నష్టం అంటే?

సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాని, తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను పెంచుకున్నాడు. నేచురల్ స్టార్ నాని అనిపించుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. నాని ఇటీవల 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో బాక్స్ ఆఫీస్ రిపోర్టులో చూద్దాం.

నాని ప్రధాన పాత్రలో

నాని ప్రధాన పాత్రలో

హీరో నాని ప్రధాన పాత్రలో వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం 'అంటే.. సుందరానికీ!'. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి గ్రాండ్ గా నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా నరేష్, నదియా, రేవతి తదితరులు కీలక పాత్రలు చేశారు.

30 కోట్ల బిజినెస్

30 కోట్ల బిజినెస్

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'అంటే.. సుందరానికీ!' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 30 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

నేచురల్ స్టార్ నాని - మలయాళ భామ నజ్రియా జంటగా నటించిన 'అంటే.. సుందరానికీ!' మంచి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే, మొదటి వీకెండ్ తర్వాత వసూళ్లు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణలో వసూళ్లు ఆశించిన మేర అయితే రాలేదు. ఏపీ, తెలంగాణలో 'అంటే.. సుందరానికీ!' కలెక్షన్లు ఈ మేరకు ఉన్నాయి.

నైజాంలో రూ. 6.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.05 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, గుంటూరులో రూ. 95 లక్షలు, కృష్ణాలో రూ. 98 లక్షలు, నెల్లూరులో రూ. 62 లక్షలతో.. రూ. 13.70 కోట్లు షేర్, రూ. 23.20 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 13.70కోట్లు వసూలు చేసిన 'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగా కూడా తక్కువగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 21.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 38.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఎంత నష్టం అంటే?

ఎంత నష్టం అంటే?

నాని నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఈ సినిమాకు క్లోజింగ్ లో కూడా 21.35 కోట్లు వచ్చాయి. అంటే మరో 9.65 కోట్లు రాబడితే ఈ సినిమా హిట్ అయ్యేది. కానీ కుదరకపోవడంతో సినిమాను నెట్ ఫ్లిక్స్ లో జూలై 10వ తేదీన దింపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X