Ante Sundaraniki Business: నాని సినిమాకు షాకింగ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రావాలంటే!
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సహజ సిద్ధమైన నటనతో కెరీర్ ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను దక్కించుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వచ్చాడు. దీంతో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ కూడా భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నాని 'అంటే.. సుందరానికీ!' అనే సినిమా చేశాడు. ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను ఎంత జరుపుకుంది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

మరో వైవిధ్యమైన మూవీతో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రమే 'అంటే.. సుందరానికీ!'. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో నరేష్, నదియా తదితరులు కీలక పాత్రలను చేశారు.

అలాంటి కథ... సమస్య హైలైట్
ఒక బ్రాహ్మణ కులానికి చెందిన హీరో.. క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో పడడం.. వీళ్ల పెళ్లిని పెద్దలు ఒప్పుకోకపోవడం.. చివర్లో హీరోకు ఏదో సమస్య ఉందని తెలిసిపోవడం వంటి విభిన్నమైన అంశాలతో 'అంటే.. సుందరానికీ!' మూవీని రూపొందించారు. ఇందులో నానికి ఉన్న సమస్యను సస్పెన్స్‌గా ఉంచడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

రిలీజ్ డేట్.. బుకింగ్స్ మంచిగా
వినూత్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'అంటే.. సుందరానికీ!' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఈ సినిమాను జూన్ 10న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా.. అన్ని చోట్లా దీనికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

ప్రమోషన్స్ షురూ.. సందడిగా
నేచురల్ స్టార్ నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, ఈరోజు సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో నాని ఫ్యాన్స్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా
నాని నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా
నాని మార్కెట్‌కు అనుగుణంగానే 'అంటే.. సుందరానికీ!' మూవీ థియేట్రికల్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 30 కోట్లు బిజినెస్ జరిగింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications











