Dasara Official Collection: షాకింగ్ కలెక్షన్స్.. 14 రోజుల్లో అతి తక్కువగా.. లాభాలు ఎంతంటే?
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన తనదైన గుర్తింపు సాధించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అష్టా చమ్మా మూవీతో మొదలైన నాని ప్రయాణం ఈగ, నిన్ను కోరి, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు నటుడిగా నిలబెట్టాయి. ఇక నాని కెరీర్ బెస్ట్ పెర్ఫానెన్స్ మూవీగా ప్రశంసలు అందుకుంటోంది దసరా. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పొగడ్తలు కురిపించిన దసరా మూవీ 2 వారాల కలెక్షన్స్ వివరాలపై ఓ లుక్కేద్దామా!
బీజీఎమ్ కు స్పందన:మహానటి కీర్తి సురేష్-నాని కాంబినేషన్ లో రెండోసారి వచ్చిన చిత్రం దసరా. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీలో సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు దక్కుతున్నాయి. మూవీలో దీక్షిత్, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్..:దసరా సినిమాకు నైజాం ఏరియాలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 34.65 కోట్ల బిజినెస్ కాగా.. కర్నాకటలో రూ. 1.85 కోట్లు, ఇతర భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో అన్ని కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ జరిగింది.
14వ రోజు కలెక్షన్స్:శ్రీకాంత్ ఓదెల తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా దసరా. ఈ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 30 లక్షలు రాబట్టగలిగింది. అంటే ఈ సినిమాకు రోజు రోజు వసూళ్లు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు 13వ రోజు రూ. 31 లక్షలు, 12వ రోజు రూ. 39 లక్షలు సాధించింది.

2 వారాల్లో ఎంతొచ్చింది?:నాని దసరా సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఇప్పుడు మాత్రం వసూళ్లు తగ్గుతున్నాయి. ఇక దీనికి 14 రోజుల్లో అంటే 2 వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 24.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.19 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, గుంటూరులో రూ. 2.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.06 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో కలిపి మొత్తంగా రూ. 43.31కోట్లు షేర్, రూ. 72.95 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా.. లాభాలు.. :రగ్గడ్ లుక్ లో నాని అదరగొట్టిన దసరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల్లో రూ. 43.31 కోట్లు సాధించగా.. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.62 కోట్లు, ఇతర భాషల్లో రూ. 1.52 కోట్లు, ఉత్తర భారతదేశంలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 10.42 కోట్లు వచ్చాయి. ఇక 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా రూ. 61.82 కోట్ల షేర్, రూ. 111.05 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంతేకాకుండా ఈ మూవీకి ఇప్పటికీ రూ. 12.82 కోట్ల లాభం కూడా సొంతమైంది.


Click it and Unblock the Notifications











