Dasara బాక్సాఫీస్ టార్గెట్.. నాని ఆ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడా?
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పటివరకు నాని నుంచి వచ్చిన సినిమాల కంటే దసరా చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టీజర్ తోనే అంచనాలు హద్దులు దాటేశాయి. తప్పకుండా సినిమా మరో రేంజ్ లో సక్సెస్ అవుతుందని నాని చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.
ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా బిజినెస్ కూడా గట్టిగానే జరుగబోతుందని అర్ధమవుతోంది. ఈ సినిమా బడ్జెట్ మొదట 50 కోట్లు అనుకోగా ఆ తరువాత ఆ లెక్క 65 కోట్లకు వెళ్లిందని టాక్. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ గానే దాదాపు 45 కోట్ల వరకు వెనక్కి తెచ్చినట్లు టాక్. ఇక సినిమాకు సంబంధించిన తెలుగు థియేటర్స్ హక్కులను దిల్ రాజు కొనుగోలు చేసి బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక తమిళంలో కూడా సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది అ రేంజ్ కు తగ్గట్టుగా మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే నాని ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాడు. అయితే ఈ సినిమా దాదాపు 80 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాక్. ఇక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 150 కోట్లు కూడా దాటవచ్చు అనే విధంగా టాక్ కూడా నడుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన సాంగ్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సముద్రఖని ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న దసరా సినిమా అందరూ అనుకున్నట్లుగా వంద కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











