Dasara 2 Days Collections: రెండవ రోజు కూడా దసరా రచ్చ.. లెక్క తగ్గినా టార్గెట్ ఫినిష్ అవ్వడం పక్కా!
నేచురల్ స్టార్ నాని మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా మార్చి 30వ తేదీన గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను SLV ప్రొడక్షన్లో సుధాకర్ చెరుకురి నిర్మించారు. అయితే ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో అయితే కలెక్షన్స్ అందుకుంది. ఇక రెండవ రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ రావచ్చు అనే వివరాల్లోకి వెళితే..

బిగ్ బడ్జెట్
దసరా సినిమా కంటే ముందు వరకు కూడా నాని ఎప్పుడు 50 కోట్లకు పైగా బడ్జెట్ తో అయితే సినిమా చేయలేదు. కానీ మొదటిసారి దసరా సినిమాతో దాదాపు 65 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టాడు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ భాషల్లో దాదాపు 3 వేలకు పైగా థియేటర్లలో అయితే విడుదలైంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిమాండ్ కు తగ్గట్టుగానే మంచి బిజినెస్ అయితే చేసింది. ఒక విధంగా చెప్పాలి అంటే నాని కెరీర్ మొత్తంలో కూడా ఇదే అత్యధిక స్థాయిలో బిజినెస్ చేసిన సినిమాగా దసరా నిలిచింది. దసరా సినిమా ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల రేంజ్లో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ 49 కోట్లకు అయితే ఫిక్స్ అయింది.

టైర్ 1 హీరోల స్థాయిలో ఒపెనింగ్స్
ఇక మొదటి రోజు దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. నాని కెరీర్ మొత్తంలో కూడా అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. అంతేకాకుండా మొన్నటి వరకు టైర్ 2 లెవెల్లో కొనసాగుతున్న నాని ఈ దెబ్బతో అయితే టైర్ వన్ హీరోల రేంజ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పవచ్చు. మొదటి రోజు దసరా సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల షేర్ కలెక్షన్స్ 38.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

థియేట్రికల్ ఆక్యుపెన్సీ
ఇక మొదటి రోజు పాజిటివ్ టాక్ అందుకోవడంతో దసరా సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక రెండవ రోజు కూడా ఆ టాక్ బాగానే ఉపయోగపడినట్లు అర్థమవుతుంది. చాలా ఏరియాలలో ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. ముఖ్యంగా రెండవ రోజు తెలుగులో ఉదయం షోలకు 26.53 ఆక్యుపెన్సి నమోదు కాగా మధ్యాహ్నం షోలకు 33.87% నమోదయింది. ఇక సెకండ్ షోకు ఆ లెక్క మరింత పెరుగుతోంది.

యూఎస్ లో 1 మిలియన్
కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు పరవాలేదు అనే విధంగానే కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే నాని గతంలో ఎప్పుడు లేనంత నెంబర్స్ ను అందుకోవడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ను అందుకున్నట్లుగా తెలుస్తోంది. నాని కెరియర్ లోనే అత్యధిక వేగంగా వన్ మిలియన్ డాలర్ ను అందుకున్న సినిమాగా కూడా దసరా మరొక రికార్డును క్రియేట్ చేసింది.

రెండవ రోజు ఎంతంటే?
ఇక ఈ సినిమా రెండవ రోజు మొత్తంగా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. ఇండియాలో రెండవ రోజు ఈ సినిమా 12 కోట్ల రేంజ్ లో అయితే నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజే ఇండియాలో దాదాపు 17 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్న దసరా రెండవ రోజు కూడా స్టాండర్డ్ గానే బాక్సాఫీస్ వద్ద సత్తా నిరూపించుకుంటోంది.

మొత్తం రెండు రోజుల కలెక్షన్స్
ఇక మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా ఇండియాలో 35.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ లెక్క 40 కోట్లను దాటినట్లుగా కూడా తెలుస్తోంది. రెండవ రోజు లెక్కతో నాని ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు మరింత దగ్గర అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక శని ఆదివారాల్లో ఈ సినిమా ఇలానే కొనసాగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ అవ్వడమే కాకుండా నాని రేంజ్ ను టైర్ 1 లోకి ఈజీగా తీసుకువస్తుంది అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











