Dasara 1st Day Collections: ఆ రికార్డు బ్లాస్ట్ అయ్యేలా అడ్వాన్స్ బుకింగ్స్.. మొత్తం ఎంత రావచ్చంటే?
నేచురల్ స్టార్ నాని ఇంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా ఒక ఒక లెక్క ఇప్పుడు రాబోయే దసరా సినిమా మరొక లెక్క అనే విధంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న దసరా సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం పక్కా అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? అలాగే ఓవర్సీస్ లో కూడా సినిమాకు బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక మొత్తంగా మొదటి రోజు దసరా సినిమా ఎంత రాబట్టే అవకాశం ఉంది? అనే వివరాల్లోకి వెళితే..

స్టార్ క్యాస్ట్
సుకుమార్ దగ్గర సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా దసరా. గోదావరిఖని కోల్ మైన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మాస్ డ్రామా మూవీ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక నాని కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో దీక్షిత్ సముద్రఖని ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

థియేటర్స్ కౌంట్
ఇక దసరా సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 65 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది. ఒక విధంగా ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో విడుదల కాబోతున్న సినిమాలలో ఒకటిగా కూడా ఒక ట్రెండ్ సెట్ చేయబోతోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో మొత్తంగా 2710 థియేటర్లలో విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ లోనే సాలీడ్ బుకింగ్స్
అయితే దసరా సినిమాకు సంబంధించిన సాంగ్స్ తో పాటు ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. దీంతో సినిమాకు తెలుగులో అయితే ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో నాని గతంలో ఎప్పుడూ లేనంత హై రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. హైదరాబాదులోనే దాదాపు 500కు పైగా షోలు ప్రదర్శించబోతున్నారు. దీంతో సినిమా ఈజీగా హైదరాబాద్ లోనే మూడు కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియాలో
ఇక ఓవర్సీస్ లో కూడా దసరా సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాను కాస్త హై లెవెల్ లోనే విడుదల చేస్తున్నారు. అక్కడ 44 లొకేషన్లలో మొత్తంగా 89 షోలు మొదటి రోజు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే 2700 టికెట్లు బుక్ అయినట్లు కతలుస్తోంది. ఫస్ట్ డే అక్కడ 70k డాలర్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

యూఎస్ లో సాలీడ్
ఇక యూఎస్ లో కూడా ఈసారి నాని సినిమా ఊహించని స్థాయిలోనే విడుదల కాబోతోంది. ప్రతిసారి అక్కడ నాని సినిమాలకు మంచి ఓపెనింగ్స్ అయితే అందుతున్నాయి. ఇక ఈసారి యూఎస్ లో కూడా నాని కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అడ్వాన్స్ సేల్స్ లో బుధవారం మధ్యాహ్నం సమయానికి దాదాపు 315k డాలర్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ 372 లోకేషన్లలో 1097 షోలు ప్రదర్శించబోతున్నారు. ఇక తప్పకుండా అయితే ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా 500k డాలర్స్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నైజాం ఆంధ్ర ఫస్ట్ డే లెక్కలు..
ఇక మొదటి రోజు ఆంధ్ర నైజాం ఏరియాలలో కూడా దసరా సినిమా ఊహించని స్థాయిలోనే ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉంది. ఒక విధంగా టైర్ 2 హీరోలలో కొనసాగుతున్న నాని.. ఆ లెవెల్లో టాప్ కలెక్షన్స్ అందుకున్న హీరోల రికార్డులను కూడా బ్రేక్ చేయబోతున్నాడు. ఇప్పటివరకు టైర్ 2 హీరోల లిస్టులో మొదట రోజు అత్యధికంగా లైగర్ ద్వారా ఏపీ నైజంలో 14 కోట్ల ఓపెనింగ్స్ అందుకుని విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పుడ నాని దసరా సినిమాతో ఆ గ్రాస్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత రావచ్చంటే?
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మిగతా భాషల్లో కూడా టాక్ ను బట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక తెలుగులో అయితే ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు దసరా సినిమాకు దాదాపు 17 కోట్ల రేంజ్ లో అయితే గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాకు మంచి టాక్ అందితే మాత్రం రెండవ రోజు నుంచి కలెక్షన్స్ ఊహించని స్థాయిలో పెరుగుతాయి అని చెప్పవచ్చు. మరి దసరా సినిమా అక్కడ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











