Dasara: అతిపెద్ద టార్గెట్ సెట్ చేసుకుంటున్న నాని.. ఏకంగా 100 కోట్లు?

నేచురల్ స్టార్ నాని హీరోగా పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీని ఆవిష్కరించారు. ఏకంగా 60 కోట్ల వరకు ఈ మూవీకి ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ మార్చి 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ కోసం నాని పూర్తి మాస్ కల్ట్ లుక్ లోకి మారిపోయాడు.

తనని తాను డిఫరెంట్ లో రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. వీరిద్దరు ఈ మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే టీజర్ తో మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ నేపధ్యంలో ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ థీయాట్రికల్ రైట్స్ కూడా ఇప్పటికి అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.

Nani Dasara movie huge demand in pan india market

ప్రస్తుతం ఇక్కా ఇతర భాషలకి సంబందించిన బిజినెస్ లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఏకంగా వంద కోట్ల వరకు జరిగే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. నాని కెరియర్ లో 100 కోట్ల మార్క్ ని అందుకోగలిగే సినిమాగా ఈ మూవీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా టీజర్ ఆకట్టుకోవడంతో అన్ని భాషల నుంచి రిలీజ్ రైట్స్ కోసం పోటీ గట్టిగానే ఉందని టాక్. దీంతో వంద కోట్ల మార్క్ బిజినెస్ ని అందుకోబోతుంది అని చెప్పుకుంటున్నారు.

ఇక రిలీజ్ తర్వాత హిట్ టాక్ పడితే కచ్చితంగా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. సినిమా కోసం పెట్టిన పెట్టుబడి కంటే 30 నుంచి 40 కోట్లు అదనంగా బిజినెస్ జరిగి నిర్మాతగా దసరా మూవీ టేబుల్ ప్రాఫిట్ ఇచ్చేలా ఉందని చెప్పుకుంటున్నారు. మరి నాని కెరియర్ లో భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X