Don't Miss!
- News
తెలంగాణలో కరోనా కల్లోలం.. 457 మందికి పాజిటివ్
- Sports
బెయిర్ స్టోను కోహ్లీ అనవసరంగా గెలికాడు.. పుజారాలా ఆడేటోడు పంత్‌లా చెలరేగాడు: సెహ్వాగ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Nani Dasara Bussiness: షూటింగ్ పూర్తవ్వకముందే దిమ్మతిరిగే డీల్.. బడ్జెట్ మొత్తం వెనక్కి వచ్చినట్లే!
నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక విభిన్నమైన పాయింట్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటు ఉంటుంది. వీలైనంత వరకు నాని సినిమాలో తన క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండేలా చూసుకుంటాడు. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న డిఫరెంట్ ప్రాజెక్ట్ దసరా మూవీపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి స్పందన లభించింది. ఇక సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ ఆఫర్స్ కూడా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉన్నాయి. రీసెంట్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ రూట్ లో సినిమా దాదాపు పెట్టిన పెట్టుబడిని మొత్తం రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సరికొత్త లుక్కుతో..
రీసెంట్ గా అంటే సుందరానికి సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాని జూన్ 10న ఆ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక నాని ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నాడు. ఇటీవల దసరా షూటింగ్‌ను స్టార్ట్ చేసిన నాని డిఫరెంట్ ఊర మాస్ లుక్ లోకి మారిపోయాడు. తన స్మార్ట్ లుక్ మొత్తం మార్చేసి ఆడియెన్స్ కి సరికొత్త కిక్కిచ్చాడు.

సుకుమార్ స్టూడెంట్ దర్శకత్వంలో..
తెలంగాణ నేపథ్యంలో డిఫరెంట్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు ఇంతకుముందు సుకుమార్ దగ్గర పలు సినిమాలకు వర్క్ చేశాడు. ఇక ఎప్పటినుంచో శ్రీకాంత్ తో సినిమా చేయాలని నాని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక ఫైనల్ గా కథ నచ్చడంతో గత ఏడాది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టాడు.
|
బాక్సాఫీస్ హిట్
ఈ సినిమాలో నాని మొదటిసారిగా పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే షాక్ ఇచ్చిన నాని తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాలో నానికి జోడిగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కూడా నేను లోకల్ అనే సినిమాతో ఇదివరకే బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ అందుకున్నారు.

భారీ డీల్..
ఇక అన్ని రకాలుగా సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉండడంతో షూటింగ్ పూర్తవక ముందే థియేట్రికల్ గా మంచి బిజినెస్ డీల్స్ సెట్ అవుతూ ఉండడం విశేషం. ఇటీవల ఓ ప్రముఖ డిజిటల్ కంపెనీ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ శాటిలైట్ అలాగే మిగతా నాన్ థియేట్రికల్ హక్కులను మొత్తం 45 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.


కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఆఫర్
దసరా సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో దాదాపు బడ్జెట్ రికవరీ చేసినట్లు సమాచారం. దాదాపు 45 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నాని సినిమాల్లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఇంతకుముందు శ్యామ్ సింగరాయ్ మేకర్స్ నాన్-థియేట్రికల్ హక్కులను రూ.35 కోట్లకు విక్రయించారు. ఇక ఇప్పుడు దసరా సినిమాకు అంతకంటే ఎక్కువగా డీల్ సెట్టవ్వడం విశేషం. ఇక సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా SLV ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానున్నట్లు సమాచారం.