Dasara Collections: దసరా ఆల్‌టైం రికార్డు.. నైజాం గడ్డపై నాని ఊచకోత.. చిరు, బాలయ్య కూడా వెనక్కే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా తనదైన సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ.. స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ హీరో నాని. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నటుడిగా తన రేంజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోన్న అతడు.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'దసరా' అనే పాన్ ఇండియా మూవీతో వచ్చాడు. దీనికి మంచి టాక్ రావడంతో పాటు స్పందన కూడా భారీగానే దక్కింది. దీంతో తాజాగా ఈ మూవీ నైజాంలో చరిత్ర సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

‘దసరా’లో నాని విశ్వరూపం
నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల రూపొందించిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

బిజినెస్‌కు తగ్గట్లుగానే రిలీజ్
తెలంగాణలోని సింగరేణి ప్రాంతం నేపథ్యంతో రూపొందిన 'దసరా' మూవీ గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమా దాదాపు 2710కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఇది నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కావడం విశేషం.

అలాంటి టాక్.. సంబరాలతో
నేచురల్ స్టార్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'దసరా' మూవీ శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. ఇందులో నాని వన్ మ్యాన్ షోతో ఇరగదీసేశాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతోన్నాయి. దీంతో అటు అతడి ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది.

మొదటి రోజు రికార్డు వసూళ్లు
టాలెంటెడ్ హీరో నాని - కీర్తి సురేష్ కాంబినేషన్‌లో రూపొందిన 'దసరా' మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా దీనికి రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

నైజాంలో అన్ని కోట్లతో రచ్చ
'దసరా' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మొదటి రోజు షోలు ఫుల్ అయిపోయాయి. అయితే, అన్నింటి కంటే కంటే నైజాం ఏరియాలో అత్యధిక రెస్పాన్స్ వచ్చింది. అక్కడ నానికి ఎక్కువ మార్కెట్ ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ స్క్రీన్లలో ఇది విడుదలైంది. ఫలితంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో మొదటి రోజు ఏకంగా రూ. 6.78 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.

నైజాం గడ్డపై ఆల్‌టైం రికార్డ్
'దసరా' మూవీకి నైజాంలో మొదటి రోజే రూ. 6.78 కోట్లు షేర్ వచ్చింది. దీంతో ఈ గడ్డపై అత్యధిక కలెక్షన్లు సాధించిన టైర్ 2 హీరోల జాబితాలో నాని మొదటి స్థానానికి చేరి ఆల్‌టైం రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే 'లైగర్' పేరిట ఉన్న రూ. 4.26 కోట్లు రికార్డును చెరిపేశాడు. ఈ చిత్రాల తర్వాత ఇస్మార్ట్ శంకర్, ఎంసీఏ, లవ్ స్టోరీ చిత్రాలు టాప్ 5 జాబితాలో కొనసాగుతోన్నాయి.

చిరంజీవి, బాలయ్య వెనక్కే
'దసరా' మూవీకి ఫస్ట్ డే నైజాంలో రూ. 6.78 కోట్లు వసూలు కావడంతో 2023లో అక్కడ అత్యధిక షేర్ రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే సంక్రాంతికి వచ్చిన బిగ్గెస్ట్ మూవీలు 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' చిత్రాలను కూడా నాని మూవీ వెనక్కి నెట్టేసింది. మొత్తానికి నైజాం గడ్డపై తనదైన మార్కును చూపించి ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడీ హీరో.


Click it and Unblock the Notifications











