Hit 3 Business : విడుదలకు ముందే నానికి కోట్ల లాభాలు.. హిట్ 3 మూవీ బిజినెస్ ఎన్ని కోట్లంటే?
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సాలిడ్ సబ్జెక్టుతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. చివరి గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారం చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక నెక్స్ట్ నాని లైన్ అప్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో సినిమాకు ఒక్క రేంజ్ లో మార్కెట్ ఏర్పడుతుంది. నాని సినిమాలకు మంచి డిమాండ్ ఉండడం ఆసక్తికరంగా మారింది.
నేచురల్ స్టార్ నాని త్వరలో శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న హిట్ 3 ది థర్డ్ కేస్ చిత్రంతో అలరించబోతున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్టుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే హిట్ : ద ఫస్ట్ కేసు, హిట్ : ది సెకండ్ కేస్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు రాబట్టాయి. చివరిగా హిట్ 2 బాక్సాఫీస్ వద్ద 42.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇక దానికి పెట్టిన బడ్జెట్ కేవలం 15 కోట్లు.

అయితే నాని హిట్ : ది థర్డ్ కేస్ లో నటిస్తుండడం మూలంగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగినట్టు ట్రేడ్ నిపుణులు తెలియజేస్తున్నారు. హిట్ 3 కోసం మేకర్స్ 60 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం నాని నయా పైసా కూడా రెమ్యూనరేషన్ గా తీసుకోలేదంట. నాని రెమ్యూనరేషన్ కాకుండానే 60 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. మరో మూడు వారాల్లో ఈ క్రేజీ ఫిలిం ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయిందనేది లెక్కలు బయటకు వచ్చాయి.
ఓటిటి రైట్స్ ను 54 కోట్లకు ప్రముఖ ఓటిపి సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు ఆడియో రైట్స్ ను సరేగామా సౌత్ 6 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటివరకు 60 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా హిందీ డబ్ వెర్షన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన బిజినెస్ కూడా జరగాల్సి ఉంది. దీంతో సినిమా రిలీజ్ కి ముందే ప్రాఫిట్ లోకి రాబోతుందని ఈ లెక్కల ద్వారా అర్థమవుతుంది.
మరోవైపు ఓవర్సీస్ లోను ఇప్పటికే హిట్: ది థర్డ్ కేస్ 2 మిలియన్ల డాలర్ వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. నార్త్ అమెరికాలో నాని కెరియర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ థియట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. హిట్ 3 తో నాని 3 మిలియన్ల డాలర్ల గ్రాస్ ను నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి హిట్ 3తో నాని కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేయబోతున్నారని ట్రేడ్ వర్గాలు జోష్యం చెబుతున్నాయి. ఇక ఈ చిత్రంలో నాని ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. షూటింగ్ దాదాపు జమ్ము కాశ్మీర్లోనే జరిగింది. మే 1న చిత్రం ఇండియాలోని ప్రధాన ప్రాంతీయ భాషలతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











