నాని రెమ్యునరేషన్ ఎంత? ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా? టోటల్ నెట్ వర్త్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పుల్ సక్సెస్ మూడ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్స్ ను అందుకుంటున్నారు. నాని ఎంచుకుంటున్న సినిమాలకు ఆడియెన్స్ లోనే కాకుండా ఇండియన్ మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. మరోవైపు 16 ఏళ్లకు పైగా కెరీయర్ ను పూర్తి చేసుకున్న నాని ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కూడబెట్టారనేది ఆసక్తికరంగా మారింది.

నాని గత చిత్రాల కలెక్షన్లు, పారితోషికం..
నాని నటించిన గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. శ్యామ్ సింగరాయ్ చిత్రం రూ.50 కోట్లతో రూపుదిద్దుకోగా రూ.65 కోట్లు సాధించింది. అంటే సుందరానికీ.. చిత్రం రూ.30 కోట్లతో తెరకెక్కి రూ.45 కోట్లు వసూళ్లు రాబట్టింది. దసరా చిత్రం రూ.65 కోట్లతో తెరకెక్కి రూ.121 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇది నాని కెరీయర్ లో ఫస్ట్ 100 కోట్ల సినిమా కావడం విశేషం. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న చిత్రం రూ.50 కోట్లతో నిర్మించగా రూ.74 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక చివరిగా సరిపోదా శనివారం చిత్రం రూ.55 కోట్లతో రూపుదిద్దుకోగా రూ.100 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇలా చివరిగా ఐదు చిత్రాలు నానికి కమర్షియల్ గా సక్సెస్ ను అందించాయి.

Nani Hit3 Remuneration and Total assets net Worth

నాని ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్..
నేచురల్ స్టార్ నాని తొలి చిత్రం 'అష్టా చమ్మా'. మొదటి చిత్రానికి రూ.4 లక్షల వరకు పారితోషికం అందుకోగా.. 2017 వరకు నాని రెమ్యునరేషన్ రూ.15 కోట్లకు చేరుకుంది. జెర్సీ చిత్రం తర్వాత నుంచి నాని మార్కెట్ పెరుగుతుండటంతో పారితోషికం కూడా పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం నాని ఒక్కో చిత్రానికి రూ.40 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు.

నాని రీసెంట్ చిత్రాల ప్రాఫిట్ ఎంత?
నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ నిర్మించిన రీసెంట్ ఫిల్మ్ 'కోర్టు'. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నానికి రూ.30 కోట్ల వరకు లాభం వచ్చింది. ఇక మే1న విడుదల కాబోతున్న హిట్ 3 చిత్రానికి రిలీజ్ కు ముందే రూ.70 కోట్ల ప్రాఫిట్ దక్కడం విశేషం. ఇలా నాని ఓవైపు సినిమాలు, మరోవైపు ప్రొడక్షన్ ద్వారా ప్రస్తుతం భారీగానే సంపాదిస్తున్నారు.

నాని ఆస్తుల నికర విలువ ఎంత?
నటుడిగా సినిమాల ద్వారా రెమ్యునరేషన్, ప్రొడ్యూసర్ గా ఓవైపు భారీ సక్సెస్ ను అందుకుంటూ నాని కోట్లల్లో లాభాలను గడిస్తున్నారు. మరోవైపు ఒట్టో, స్ప్రైట్, మినిట్ మెయిడ్, క్లోజప్ వంటి బ్రాండ్స్ కు ఉన్న ఒప్పందాలతోనూ కోట్లల్లోనే ఆర్జిస్తున్నారు. ఇవే కాకుండా నాని దగ్గర ఖరీదైన కార్లు రేంజ్ రోవర్ 3.0, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఫార్చూనర్, టోయోట ఇన్నోవా క్రిస్టా కూడా ఉన్నాయి. ఇక మరోవైపు కోట్లు విలువ చేసే ప్రాపర్టీస్ ను కూడా కలిగి ఉన్నారు. ఇలా అన్నీ కలిపి నాని ఆస్తుల నికర విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: nani hit 3 remuneration
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X