Dasara 4 Days Collection: నాని దసరాకు బ్రేక్ ఈవెన్ పూర్తి? బాంచత్ ఇక అన్ని లాభాలే!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాడి శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టగా.. అంటే సుందరానికి సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇక హిట్ 2 సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు దసరా మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. న్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకోపోతంది. ఫలింతగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ క్రమంలో దసరా చిత్రానికి 4వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

అదిరిపోయిన మ్యూజిక్..

అదిరిపోయిన మ్యూజిక్..


సహాయ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని తర్వాతి కాలంలో ఊహించని విధంగా హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అదిరిపోయిందని టాక్ వస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

నాని, మహానటి కీర్తి సురేష్ రెండోసారి జత కట్టిన దసరా సినిమాకు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 34.65 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, ఇతర భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో అన్ని కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ అయినట్లు సమాచారం.

థియేటర్ కౌంట్..

థియేటర్ కౌంట్..

నాని లేటెస్ట్ మూవీ దసరా సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో 300 స్క్రీన్స్, సీడెడ్ లో 190, ఆంధ్రాలో 410కి పైగా థియేటర్లలో ప్రదర్శించారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 900 స్క్రీన్లకుపైగా షోలు నడుస్తున్నాయి. ఇక కర్ణాటకలో 80 స్క్రీన్లకుపైగా, తమిళనాడులో 80 స్క్రీన్లకుపైగా, కేరళలో 100 స్క్రీన్లకుపైగా, హిందీలో 750 స్క్రీన్లకుపైగా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో 800 స్క్రీన్లను అన్నింటిని కలుపుకుని వరల్డ్ వైడ్ గా 2700 థియేటర్లలో దసరా స్క్రీనింగ్ జరుగుతోంది.

థియేటర్ ఆక్యుపెన్సీ..

థియేటర్ ఆక్యుపెన్సీ..

తొలి చిత్రంతోనే దర్శకుడిగా సత్తా చాటాడు శ్రీకాంత్ ఓదెల. సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో దసరాకు నాలుగో రోజున తెలుగులో ఉదయం 41.20 శాతం, మధ్యాహ్నాం 60.17 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే తమిళంలో ఉదయం 15.91 శాతం, మధ్యహ్నాం 31.54 శాతంగా రికార్డయింది. ఇక హిందీలో ఉదయం 11.03 శాతం, మధ్యాహ్నాం 16.25 శాతంగా ఫిక్స్ అయింది. మలయాళం విషయానికొస్తే ఉదయం 7.58 శాతం, మధ్యాహ్నాం 5.78 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది

4వ రోజు కలెక్షన్స్..

4వ రోజు కలెక్షన్స్..

క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం దసరా. ఆదిలాబాద్ జిల్లాలోని వీర్ల పల్లి అనే గ్రామ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే దసరాకు 4వ రోజు రూ. 14 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

4 రోజుల వసూళ్లు.. బ్రేక్ ఈవెన్..

4 రోజుల వసూళ్లు.. బ్రేక్ ఈవెన్..

నాని, కీర్తి సురేష్, దీక్షిత్ అద్భుతమైన నట పర్ఫామెన్స్ తో దసరా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో దసరా సినిమాకు 4 రోజుల్లో రూ. 59.05 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. రూ. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే రూ. 38 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అంటే 4వ రోజున దసరా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసే అవకాశ ఉన్నట్లు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X