Dasara 5 Days Collection: ఘోరంగా పడిపోయిన వసూళ్లు.. కానీ, ఆ క్లబ్ లోకి చేరి దసరా రికార్డ్!

బాపు వంటి అగ్ర దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి హీరోగా మారాడు నాని. అలా మారే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నాని తర్వాత మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు హీరోగా అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నాడు. ఇక నాని తాజాగా ఈ ఏడాది ధరణిగా అవతారం ఎత్తిన సినిమా దసరా. పూర్తి రగ్గడ్ లుక్ లో ఆకట్టుకున్న నాని దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో దీని 5వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

బీజీఎమ్ హైలెట్ కాగా..

బీజీఎమ్ హైలెట్ కాగా..

నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ ఆరేళ్ల తర్వాత రెండోసారి జత కట్టిన సినిమా దసరా. నాని ధరణిగా కెరీర్ బెస్ట్ పర్పామెన్స్ ఇవ్వగా.. కీర్తి సురేష్ వెన్నెలగా ఆకట్టుకుంది. వీళ్లతోపాటు దీక్షిత్ మొదటి సినిమా అయినా తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇక సముద్ర ఖని, సాయి కుమార్, షైన్ టామ్ చాకో, ఝాన్సీ, జరీనా వాహెబ్ వంటి తదితరులు అలరించగా సంతోష్ నారాయణ్ బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని టాక్ వస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

..

దసరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. మొత్తంగా రూ. 34.65 కోట్ల బిజినెస్ అయింది. ఇక కర్నాకటలో రూ. 1.85 కోట్లు, ఇతర భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లు ఇలా మొత్తం కలిపి వరల్డ్ వైడ్ గా రూ. 48 కోట్ల బిజినెస్ జరిగనట్లు తెలుస్తోంది.

థియేటర్ కౌంట్..

థియేటర్ కౌంట్..

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలు కలుపుకుని మొత్తంగా 900 స్క్రీన్లకుపైగా థియేటర్లలో నాని దసరా సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇక కర్ణాటకలో 80, తమిళనాడులో 80, కేరళలో 100 స్క్రీన్లకుపైగా, హిందీలో 750 స్క్రీన్లకుపైగా ఈ చిత్రాన్ని స్క్రీనింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక వీటితోపాటు ఓవర్సీస్‌లోని 800 స్క్రీన్లను అంతా కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 2700 థియేటర్లలో దసరాను విడుదల చేశారు.

థియేటర్ ఆక్యుపెన్సీ..

థియేటర్ ఆక్యుపెన్సీ..

దసరా మూవీకి 5వ రోజున తెలుగులో ఉదయం 15.60 శాతం, మధ్యాహ్నాం 19.88 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే తమిళంలో ఉదయం 7.45 శాతం, మధ్యాహ్నాం 15.70 శాతంగా రికార్డయింది. ఇక హిందీలో ఉదయం 7.47 శాతం, మధ్యాహ్నాం 10.06 శాతంగా ఫిక్స్ అయింది. మలయాళం థియేటర్ ఆక్యుపెన్సీ చూస్తే ఉదయం 2.77 శాతం, మధ్యాహ్నాం 4.33 శాతంగా తెలిసింది. అయితే సోమవారం కారణంగా ఆక్యుపెన్సీ తగ్గినట్లు తెలుస్తోంది.

5వ రోజు వసూళ్లు..

5వ రోజు వసూళ్లు..

క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల తొలిసారిగా దర్శకత్వం చేసిన దసరా చిత్రానికి ఆదరణ బాగానే లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని వీర్ల పల్లి అనే గ్రామంలో లిక్కర్, రాజకీయాలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద దసరా మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు 5వ రోజు అతి తక్కువగా రూ. 4 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించింది.

5 రోజుల వసూళ్లు.. ఆ రికార్డ్

5 రోజుల వసూళ్లు.. ఆ రికార్డ్

దసరా సినిమాకు 5 రోజుల్లో రూ. 61.65 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేసి తెలిపాయి. అయితే వర్కింగ్ డే అయిన సోమవారం కారణంగా దసరాకు కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే రూ. 90వ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన దసరా మూవీ 5వ రోజు రూ. 100 కోట్ల క్లబ్ లోకి పడిపోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే వారంలోపే వంద కోట్ల క్లబ్ లోకి చేరిన మూవీగా దసరా రికార్డ్ కొట్టనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X