Dasara 6 Days Collection: దసరాకు అలాంటి లాభాలు.. వంద కోట్ల క్లబ్ కి ఎంత రావాలంటే?

గతేడాది శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని తర్వాత అంటే సుందరానికి మూవీతో అలరించాడు. ఇక ఈ ఏడాది దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో దసరా సినిమాకు 6వ రోజు వచ్చిన కలెక్షన్స్ , థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలను పరిశీలిస్తే..

 అలాంటి రెస్పాన్స్..

అలాంటి రెస్పాన్స్..


సహాయ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని తర్వాతి కాలంలో ఊహించని విధంగా హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా సినిమాకు సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్...

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్...


దసరా మూవీకి నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా ఆంధ్ర, తెలంగాణ మొత్తం కలిపి రూ. 34.65 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, ఇతర భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ అయినట్లు సమాచారం. రూ. 50 కోట్లకు బ్రేక్ ఈవెన్ ఫిక్స్ అయింది.

 థియేటర్ కౌంట్..

థియేటర్ కౌంట్..


నాని లేటెస్ట్ మూవీ దసరా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలిపి 900 థియేటర్లలో విడుదల చేశారు. కర్ణాటకలో 80, తమిళనాడులో 80, కేరళలో 100, హిందీలో 750 స్క్రీన్లకుపైగా దసరా చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు సమాచారం అందింది. ఇక ఓవర్సీస్‌లో 800 స్క్రీన్లతో కలిపి మొత్తంగా వరల్డ్ వైడ్ గా 2700 థియేటర్లలో దసరా సినిమాను రిలీజ్ చేశారు.

థియేటర్ ఆక్యుపెన్సీ..

థియేటర్ ఆక్యుపెన్సీ..

దసరా మూవీకి 6వ రోజున తెలుగులో ఉదయం 16.73 శాతం, మధ్యాహ్నాం 20.63 శాతం, సాయంత్రం 19.57 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక తమిళంలో ఉదయం 11.96, మధ్యహ్నాం 27, సాయంత్రం 12.35 శాతంగా రికార్డయింది. హిందీలో ఉదయం 8.20 శాతం, మధ్యాహ్నాం 12.57, సాయంత్రం 10.46 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. 5వ రోజుతో పోల్చుకుంటే ఆరో రోజు ఆక్యుపెన్సీ పర్వాలేదనిపిస్తోంది.

6వ రోజు కలెక్షన్స్..

6వ రోజు కలెక్షన్స్..


సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించిన దసరా. ఆదిలాబాద్ జిల్లాలోని వీర్ల పల్లి అనే గ్రామంలో లిక్కర్, పాలిటిక్స్, త్రికోణం ప్రేమకథ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే దసరాకు 6వ రోజు రూ. 4 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 బ్రేక్ ఈవెన్ పూర్తి.. లాభాలు ఎంతంటే..

బ్రేక్ ఈవెన్ పూర్తి.. లాభాలు ఎంతంటే..

నాని, కీర్తి సురేష్, దీక్షిత్ నటించిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగానే రాబడుతోంది. ఈ నేపథ్యంలో దసరా సినిమాకు 6 రోజుల్లో రూ. 65.30 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమా ఇప్పటికీ రూ. 92 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే దసరా సినిమాకు ఇంకా రూ. 8 కోట్లు వస్తే రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరుకోనుంది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు లాభాలు భారీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X