Dasara 8 Days Collection: దసరాకు ఊహించని కలెక్షన్స్.. నాని రికార్డ్.. లాభాలు ఎంతంటే?
బాపు వంటి లెజండరీ డైరెక్టర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసి అనూహ్యంగా హీరోగా మారాడు నాని. అష్టా చెమ్మా మూవీతో హీరో డెబ్యూ ఇచ్చి.. తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓవైపు హీరోగా అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నాడు. ఇక నాని తాజాగా ఈ ఏడాది ధరణిగా అవతారం ఎత్తిన సినిమా దసరా. పూర్తి రగ్గడ్ లుక్ లో ఆకట్టుకున్న నాని దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో దీనికి 8వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
అలాంటి బీజీఎమ్ స్కోర్..: నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ ఆరేళ్ల తర్వాత రెండోసారి జత కట్టిన సినిమా దసరా. ధరణిగా నాని కెరీర్ బెస్ట్ పర్పామెన్స్ ఇవ్వగా.. వెన్నెలగా కీర్తి సురేష్ ఒదిగిపోయింది. వీళ్లతోపాటు దీక్షిత్ మొదటి సినిమా అయినా తన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక సముద్ర ఖని, సాయి కుమార్, షైన్ టామ్ చాకో, ఝాన్సీ, జరీనా వాహెబ్ వంటి తదితరులు అలరించగా సంతోష్ నారాయణ్ బీజీఎమ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని టాక్.

ప్రీ రిలీజ్ బిజినెస్..: దసరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. మొత్తంగా రూ. 34.65 కోట్ల బిజినెస్ అయింది. ఇక కర్నాకటలో రూ. 1.85 కోట్లు, ఇతర భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లు ఇలా మొత్తం కలిపి వరల్డ్ వైడ్ గా రూ. 48 కోట్ల బిజినెస్ జరిగనట్లు తెలుస్తోంది.
థియేటర్ కౌంట్ ఇలా..: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలు కలుపుకుని మొత్తంగా 900 స్క్రీన్లకుపైగా థియేటర్లలో నాని దసరా సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇక కర్ణాటకలో 80, తమిళనాడులో 80, కేరళలో 100 స్క్రీన్లకుపైగా, హిందీలో 750 స్క్రీన్లకుపైగా ఈ చిత్రాన్ని స్క్రీనింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక వీటితోపాటు ఓవర్సీస్‌లోని 800 స్క్రీన్లను అంతా కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 2700 థియేటర్లలో దసరాను విడుదల చేశారు.

థియేటర్ ఆక్యుపెన్సీ..: దసరా మూవీకి 8వ రోజున తెలుగులో ఉదయం 12.18 శాతం, మధ్యాహ్నాం 14.56 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే తమిళంలో ఉదయం 7.35 శాతం, మధ్యాహ్నాం 20.47 శాతంగా రికార్డయింది. ఇక హిందీలో ఉదయం 6.41 శాతం, మధ్యాహ్నాం 10.17 శాతంగా ఫిక్స్ అయింది. అయితే దసరా సినిమాకు మిడిల్ వీక్ లో ఆక్యుపెన్సీ తగ్గినట్లుగా తెలుస్తోంది.
8వ రోజు వసూళ్లు..: క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల తొలిసారిగా దర్శకత్వం చేసిన దసరా చిత్రానికి ఆదరణ బాగానే లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని వీర్ల పల్లి అనే గ్రామంలో లిక్కర్, రాజకీయాలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద దసరా మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు 8వ రోజు అతి తక్కువగా ఊహించని విధంగా రూ. 2 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించింది.
8 రోజుల వసూళ్లు.. లాభాలు..: దసరా సినిమాకు 8 రోజుల్లో రూ. 69.05 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేసి తెలిపాయి. కానీ మిడిల్ వీక్ కారణంగా కారణంగా దసరాకు కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన నానీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక క్లీన్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ నిర్మాతలకు రూ. 5.17 కోట్ల లాభం వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











