Dasara Collection: దసరాకు అలాంటి ఆక్యుపెన్సీ.. పెరగనున్న లాభాలు! నెట్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాడి శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టగా.. అంటే సుందరానికి సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇక హిట్ 2 సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు దసరా మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా పాజిటివ్ టాక్ తో దూసుకోపోతుంది. ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 9వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

చెరిగిపోని ముద్ర: సహాయ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని తర్వాతి కాలంలో ఊహించని విధంగా హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకుని నేచురల్ స్టార్ అయ్యాడు. ఇక తాజాగా ఈ ఏడాది ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా సినిమాతో మాస్ హీరోగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు.

Nani Keerthy Suresh Dasara Movie 9 Days Expected Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్..: దసరా సినిమాకు నైజాం ఏరియాలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 34.65 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, ఇతర భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో అన్ని కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ జరిగింది.

థియేటర్ కౌంట్ డీటెల్స్.. : నాని లేటెస్ట్ మూవీ దసరా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఆంధ్రా ఇలా అన్ని ఏరియాలో కలుపుకుని మొత్తంగా 900 థియేటర్లలో విడుదల చేశారు. ఇక కర్ణాటకలో 80, తమిళనాడులో 80, కేరళలో 100, హిందీలో 750 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఓవర్సీస్‌లో 800 స్క్రీన్లతో సహా అన్నింటిని కలుపుకుని వరల్డ్ వైడ్ గా 2700 థియేటర్లలో దసరా సినిమాని రిలీజ్ చేశారు.

Nani Keerthy Suresh Dasara Movie 9 Days Expected Worldwide Box Office Collection

థియేటర్ ఆక్యుపెన్సీ..: దసరా సినిమాకు 9వ రోజున తెలుగులో ఉదయం 15.98 శాతం, మధ్యాహ్నాం 30.65 శాతం, సాయంత్రం 33.28 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. తమిళంలో ఉదయం 19.38 శాతం, మధ్యాహ్నాం 48.13 శాతం, సాయంత్రం 19.20 శాతం రికార్డయింది. ఇక హిందీలో ఉదయం 9.94 శాతం, మధ్యాహ్నాం 13.51 శాతం, సాయంత్రం 12.77 శాతంగా ఆక్యుపెన్సీ ఉంది. వీటిలో ఎక్కువగా మధ్యాహ్నాం షోలకు ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్నట్లు అర్థమవుతోంది.

9వ రోజు కలెక్షన్స్: క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల మొదటి సారిగా దర్శకత్వం వహించిన చిత్రం దసరా. ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే దసరాకు 9వ రోజు అయిన శుక్రవారం రూ. 2.15 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

9 రోజుల వసూళ్లు..: లాభాలు: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ అద్భుతమైన నట పర్ఫామెన్స్ తో దసరా సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో దసరా సినిమాకు 9 రోజుల్లో రూ. 71.25 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించిందని సమాచారం. ఇక ఈ మూవీ ఇప్పటికే రూ. 101.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నిర్మాతలకు రూ. 7.42 కోట్లు లాభం తెచ్చిపెట్టింది. ఇక 9వ రోజుతో వసూళ్లతో ఈ లాభం మరింత పెరగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X