Saripodha Sanivaaram: చరిత్రను సృష్టించిన నాని.. ఏకంగా 170 కోట్లతో తొలి హీరోగా సంచలన రికార్డు
నేచురల్ స్టార్ నాని.. తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా మారుమ్రోగిపోతోన్న పేరు ఇది. అంతలా అతడు తనదైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను అందుకుంటూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నాని వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇటీవలే 'సరిపోదా శనివారం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో నాని తాజాగా ఓ సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆ సంగతులు మీరే చూసేయండి!
సరిపోదా శనివారం అంటూ నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ రూపొందించిన సినిమానే 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
'సరిపోదా శనివారం' మూవీకి నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా నాని సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
అప్పుడే 20 కోట్లు పైగా బిజినెస్
ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల బిజినెస్‌లు చేసుకోవడం నానికి కొత్తేమీ కాదు. అందుకే 'గ్యాంగ్ లీడర్' మూవీ నిరాశ పరిచినా ఆ తర్వాత వచ్చిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా మాత్రం మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు బిజినెస్‌ను చేసుకుని సత్తా చాటింది. అలాగే, ఇది ప్రేక్షకులను అలరించి హిట్ అయింది.

భారీగా పెంచేసిన సుందరం
'శ్యామ్ సింగరాయ్' సినిమా విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత రూపొందిన 'అంటే సుందరానికీ' సినిమాపై అంచనాలు మరింతగా ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం కోసం చాలా మంది బయ్యర్లు పోటీ పడ్డారు. ఫలితంగా 'అంటే సుందరానికీ' సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 30 కోట్లు మేర వ్యాపారాన్ని జరుపుకుని సత్తా చాటుకుంది.
దసరాతో రికార్డులు నమోదు
'అంటే సుందరానికీ' సినిమా నిరాశ పరిచిన తర్వాత నాని మాస్ స్టోరీతో 'దసరా' అనే సినిమాను చేశాడు. దీనికి భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుని టైర్ 2 హీరోల్లో ఎన్నో రికార్డులు నమోదు చేసింది.

హాయ్ నాన్నతో డీసెంట్‌గానే
'దసరా'తో పాన్ ఇండియా రేంజ్‌లో విజయాన్ని అందుకున్న నాని.. ఆ తర్వాత 'హాయ్ నాన్న' అనే మూవీని చేశాడు. కానీ, ఎందుకనో ఈ చిత్రానికి కాస్త డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలను కలుపుకుని రూ. 27.60 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను మాత్రమే చేసుకుని అందరినీ ఆశ్యర్యానికి గురి చేసేసింది.
170 కోట్లతో సరికొత్త చరిత్ర
'సరిపోదా శనివారం' మూవీకి రూ. 41 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో నాని నటించిన గత ఐదు చిత్రాలకు కలిపి ఏకంగా రూ. 170.60 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా తెలుగు సినీ చరిత్రలోనే ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక టైర్ 2 హీరోగా నాని సంచలన రికార్డును నమోదు చేశాడు. అంటే ఏవరేజ్‌గా ఒక్కో మూవీకి రూ. 34.12 కోట్లు బిజినెస్ చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











