twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాంగ్‌ లీడర్‌ క్లోజింగ్ కలెక్షన్లు.. టార్గెట్‌కు చేరువగా నాని.. ఎంత నష్టమంటే!

    |

    నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించలేకపోయింది. క్లాస్ ఆడియెన్స్ కనెక్ట్ అయినప్పటికీ.. మాస్‌ను థియేటర్‌కు రప్పించలేకపోయింది. వెరసిగా యావరేజ్ సినిమాగా నిలువడంతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చూపించలేకపోయింది. గత 17 రోజుల్లో గ్యాంగ్ లీడర్ ఎంత వసూలు చేసిందంటే..

    17వ రోజున వసూళ్లు

    17వ రోజున వసూళ్లు

    గ్యాంగ్ లీడర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఓ మాదిరి కలెక్షన్లు కూడా సాధించినట్టు కనిపిస్తున్నది. 17వ రోజున నైజాంలో రూ.10 లక్షలు, సీడెడ్‌లో రూ.3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.4.5 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2.4 లక్షలు, గుంటూరులో రూ.2.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.2.2 లక్షలు, నెల్లూరులో రూ.1.3 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం 17వ రోజున 29 లక్షల షేర్‌ను సాధించింది.

    మొత్తంగా 17వ రోజున ఎంతంటే

    మొత్తంగా 17వ రోజున ఎంతంటే

    ఇక 17వ రోజుల్లో గ్యాంగ్ లీడర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. నైజాంలో రూ.6.78 కోట్లు, సీడెడ్‌లో రూ.2.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.32 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.50 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.05 కోట్లు, గుంటూరులో రూ.1.32 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.26 కోట్లు, నెల్లూరులో రూ.60 లక్షలు సాధించింది.

     ఓవర్సీస్‌లో కలెక్షన్లు

    ఓవర్సీస్‌లో కలెక్షన్లు

    ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కూడా గ్యాంగ్ లీడర్ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.1.93 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ.4.24 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 23 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది.

    ఎంత నష్టమంటే

    ఎంత నష్టమంటే

    వరుసగా నాని చిత్రాలు విజయం సాధించడంతో గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. మొత్తంగా ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా బిజినెస్ జరగడంతో సుమారు 30 కోట్ల టార్గెట్‌తో రిలీజైంది. అయితే 40 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా, రూ.23 కోట్లకుపైగా షేర్‌ను సాధించింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే సుమారు 4 కోట్లకుపైగా నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది.

    English summary
    Nani's latest movie Gang Leader is set to release in September 13th. As part of the promotion, A song from movie is released on August 15th, Which got good response. This movie made Rs.28 crores overall business. After 17 days, This movie stalled at 23 crores at box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X