నాని గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటంటే.. మూడు రోజుల్లో షాకింగ్‌గా కలెక్షన్లు

Recommended Video

Nani's Gang Leader 3 Days Collections || క్రేజీగా నాని గ్యాంగ్‌లీడర్‌ కలెక్షన్లు !

నేచురల్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా మిశ్రమ స్పందన మధ్య తొలి వారాంతం భారీ వసూళ్లు సాధిస్తున్నది. గత మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు నాని స్టామినాకు అద్దం పట్టాయి. సోమవారం వసూళ్లు నిలకడగా ఉంటే గ్యాంగ్ లీడర్స్‌ను ఆపడం సాధ్యం కాదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. గత మూడు రోజుల్లో గ్యాంగ్ లీడర్స్ ఎంత మొత్తం వసూలు చేసిందంటే..

నైజాంలో భారీగా వసూళ్లు

నైజాంలో భారీగా వసూళ్లు

సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన నానిస్ గ్యాంగ్ లీడర్ చిత్రం గత మూడు రోజుల్లో రూ.7.5 కోట్ల గ్రాస్, 4.66 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఇక సీడెడ్‌లో ఈ చిత్రం రూ.2 కోట్ల గ్రాస్, రూ.1.41 కోట్ల షేర్ సాధించింది. దీంతో డిస్టిబ్యూటర్లలో సానుకూల స్పందన వస్తున్నది.

ఆంధ్రాలో కలెక్షన్లు

ఆంధ్రాలో కలెక్షన్లు

ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. వైజాగ్‌లో రూ.1.57 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.06 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 64 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.93 లక్షలు, గుంటూరులో రూ.1.03 కోట్లు, నెల్లూరు రూ.35 లక్షలు వసూలు చేసింది. గత మూడు రోజుల్లో మొత్తంగా రూ.8.1 కోట్ల గ్రాస్, రూ.5.58 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో

ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కూడా గ్యాంగ్ లీడర్ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. కర్నాటకలో రూ.2.1 కోట్ల గ్రాస్, రూ.1.02 కోట్ల షేర్‌ను సాధించగా, అమెరికాలో రూ.5.3 కోట్ల గ్రాస్, రూ.2.38 కోట్ల షేర్‌ను సాధించింది. మిగితా ప్రాంతాల్లో రూ.1.6 కోట్ల గ్రాస్, రూ.65 లక్షల షేర్ సాధించింది.

ఎంత వసూలు చేస్తే లాభాల్లోకి

ఎంత వసూలు చేస్తే లాభాల్లోకి

ఎంసీఏ, జెర్సీ లాంటి సక్సెస్ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమా వస్తుండటంతో మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.30 కోట్లకుపైగా జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.26.6 కోట్ల గ్రాస్ (15.7 కోట్ల షేర్)ను సాధించింది. అంటే ఈ చిత్రం రూ.40 కోట్లకుపైగా వసూలు చేస్తే లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X