Nani's గ్యాంగ్ లీడర్ 6 రోజుల కలెక్షన్లు: లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలంటే
నేచురల్ స్టార్ నాని, RX 100 ఫేమ్ కార్తీకేయ నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం తొలివారాంతం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మండమైన వసూళ్లను ప్రదర్శించింది. అయితే వారాంతం తర్వాత సినిమా కలెక్షన్లు ఊహించినంతగా లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గత 6 రోజుల్లో గ్యాంగ్ లీడర్ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

ప్రీ రిలీజ్ బిజినెస్
ఎంసీఏ, జెర్సీ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన నానిస్ గ్యాంగ్ లీడర్ చిత్రం అంచనాలు భారీగా ఉండటం నాని కెరీర్‌లోనే అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.28 కోట్ల బిజినెస్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత ఆరో రోజున రూ.36 లక్షలు వసూలు చేయడం గమనార్హం.

6వ రోజు కలెక్షన్లు
గ్యాంగ్ లీడర్ చిత్రం 6 రోజున నైజాంలో రూ.18 లక్షలు, సీడెడ్ రూ.4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.4.42 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, గుంటూరులో రూ.1.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.1.8 లక్షలు, నెల్లూరులో రూ.1.2 లక్షలు వసూలు చేసింది.

మొత్తం 6 రోజుల వసూళ్లు
ఇక 6 రోజుల మొత్తం కలెక్షన్లు చూసుకొంటే నైజాంలో రూ.5.75 కోట్లు, సీడెడ్‌లో రూ.1.76 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.91 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.24 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.0.86 లక్షలు, గుంటూరులో రూ.1.13 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.07 కోట్లు, నెల్లూరులో రూ.0.47 కోట్లు వసూలు చేసింది.

లాభం రావాలంటే ఎంత కలెక్ట్
గత ఆరు రోజుల్లో మొత్తంగా ఏపీ, తెలంగాణలో రూ.14.19 కోట్లు వసూలు చేయగా, కర్ణాటకలో, మిగితా రాష్ట్రాల్లో రూ.1.51 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో రూ. 3.51 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 32.60 కోట్ల గ్రాస్, 19.21 కోట్ల షేర్ వసూలు చేయడం గమనార్హం. ఇంకా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.9.79 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











